40.2 C
Hyderabad
April 29, 2024 15: 04 PM
కవి ప్రపంచం

విశ్వ వ్యాపకుడు

#Prof G V Seshareddy

పివి రాజకీయం విశ్వవ్యాప్తి విదితం

వీరి ఆర్ధిక సంస్కరణలకు ప్రతిదేశం దాసోహం

ప్రధాన మంత్రుల ఖ్యాతులలో పి వి స్థానం ప్రథమం

ఇది ప్రపంచమంతా ఒప్పుకుంటున్న నగ్న సత్యం

నిస్వార్ధ నిష్పక్షపాత రాజకీయం పి వికి ధర్మం

నీతి నిజాయితీలే పి వికి ఆభరణం

ఏ పదవిలోనైనా ఆ పదవికే వన్నె తెచ్చిన వైనం

క్రమశిక్షణ, అంకితభావం పి వి గారికి సొంతం

ఇదే ప్రధాన మంత్రి పదవికి పలికింది ఆహ్వానం

అజాత శత్రువని వేనోళ్ళ పొగడడం నగ్నసత్యం

విదేశాంగ మంత్రిగా పి వి రాజకీయం అత్యద్భుతం

భూ సంస్కరణలతో ప్రజల మనసులలో పి వి దైవం

ప్రజా సంక్షేమమే రాజకీయ లక్ష్యంగా ప్రక్షాళనం

పి వి ప్రణాళిక ప్రతి నాయకునికి ఆదర్శం

ప్రపంచాన్నే ఆకట్టుకున్న పి వికారి బహుభాషా పాండిత్యం

14 భాషలలో పాండిత్యం అంటే కదా ఆశ్చర్యం

రాజకీయమంటే ఏమిటో పి వి గారి జీవితం తెలుపుతుంది

ప్రపంచ శాంతి కోసం పివి గారి కృషి అనిర్వచనీయం

నిరంతరము పివి సంస్కరణలకు ప్రజల నీరాజనం

పివి గారి అజాత శత్రుత్వం ప్రపంచ చరిత్రలో అజరామరం

పాలనలో ఆటుపోట్లు సహజమని చాటి చెప్పిన నిరాడంబరతత్వం

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైనం

దేశభక్తి, నిష్పక్షపాతం రాజకీయాలకు అవసరమని చాటిచెప్పిన పివి గారి జీవితం

పట్టుదల, కృషి కసి ఈయనకు సొంతం

అందుకే ప్రతి అడుగులో విజయం

రాజకీయానికి నేర్పించాడు సంస్కారం

మచ్చలేని జీవితంతో అజరామరం

మన తెలుగు బిడ్డడు అని కదా మనందరికి గర్వకారణం

ఆంధ్రరత్న ప్రొఫెసర్ జి వి శేషారెడ్డి, కడప, సెల్ నెం: 9440424322

Related posts

తిరుగుపయనం

Satyam NEWS

స్వాగతం శుభకృతు

Satyam NEWS

తొలకరి

Satyam NEWS

Leave a Comment