42.2 C
Hyderabad
May 3, 2024 18: 26 PM
Slider కవి ప్రపంచం

చివరి చరణం

#K.Harinath

అతనెప్పుడూ

ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా

పాడుతూనే ఉంటాడు

అతడి పాటలో

పల్లవి జీవన రాగమౌతుంది

ప్రతి చరణంలో

సాగిపోతున్న జీవితం కనిపిస్తున్నది

అతడిల్లు ఎప్పుడూ

ఆనంద నిలయమే

సంగీత సాగరంలో నిరంతరం తేలియాడే

అతడి జీవితంలో

మాయదారి మహమ్మారి అపశృతి

చోటు చేసుకుంది

గొంతు మూగబోయింది

నీరసంతో సత్తువ కోల్పోయి హాస్పటల్ కి

చేరుకున్నాడు

చివరి చరణంలో దుఃఖరాగానెత్తుకొని

ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్ అంటూ

మనల్ని శోకసముద్రంలో

వదిలేసి వెళ్ళిపోయాడు

(యదార్ధ సంఘటన ఆధారంగా)

కె.హరనాథ్, సెల్ నెం: 9703542598

Related posts

బటన్ నొక్కితే..క్షణాల్లో పోలీసులు: 25 రోజుల్లో 1456 ఫోన్ కాల్స్..

Satyam NEWS

విశాఖ నారాయణ కాలేజీలో దారుణం

Satyam NEWS

కార్మికుల కోసం రాజీలేని పోరాటం చేసిన నాయిని

Satyam NEWS

Leave a Comment