40.2 C
Hyderabad
April 28, 2024 15: 47 PM
కవి ప్రపంచం

అమృతమయి అమ్మ

#K.Veena Reddy Meerpet

నవమాసాలు నీ తనువనే గర్భగుడిలో

ఈ తనయుని మోసిన కల్పతరువు నీవు!

కోనేటి వంటి ఉమ్మనీటి గంగలో

నను జలకమాడించిన జననివి

నాకు నవజీవన సంజీవనివి!

అనుదినం నీ అనురాగ శ్వాసతో,

దినదినం నాకూపిరులూదిన నీవు,

పవన మాతవు..నా ప్రాణ దాతవు!

దుర్భర ప్రసవ వేదనను భరించి

నా గర్భ కుహర బాధను హరించి,

జన్యవై నాకు జన్మనిచ్చిన విరించివి!

అమృతం తాగిన వాళ్లు దేవతలైతే,

క్షీరామృత హృదయనిధియై, ప్రేమ నదియై

ననుగన్నతల్లి నా మాతృదేవత యైనది!

ఏడాది నాడే కాదు పదేళ్లనాడైనా,

పదేళ్ల నాడే కాదు వందేళ్లనాడైనా,

అమ్మా నీ  మమతామృత సన్నిధే

జన్మకంతా నాకు తరగని పెన్నిధి!

జననీ..నా జన్మ ముగిసేకాలాన కూడా,

మృత్యుదేవత నను ముట్టుకొనే వేళ..

నా మాతృదేవతే నా చెంత నుండింటే,

మరణాయాసమే నాకు లేకుండును కదా..

అనుకునేటంత అధ్బుత మూర్తివి నీవు!

మరుజన్మంటూ వుంటే  ఓ తల్లీ..

నీకు అమ్మనై జన్మిస్తాను మళ్లీ!

కె. వీణారెడ్డి, హైదరాబాద్ -97, సెల్ : 7337058025

Related posts

నా దారి అటువైపే…….

Satyam NEWS

చివ‌ర‌కు మిగిలేది…

Satyam NEWS

అమృతమే

Satyam NEWS

Leave a Comment