37.2 C
Hyderabad
May 2, 2024 13: 32 PM
కవి ప్రపంచం

అపర చాణక్యుడు!

#Kattekola China Narsaiah

వంగర వరపుత్రుడు

తెలంగాణ ముద్దుబిడ్డడు

రాజసం ఉట్టిపడే ఠీవీ

నిజాం నిరంకుశ పాలనలో

పురుడు పోసుకున్న

ఉస్మానియా

విశ్వవిద్యాలయం విద్యార్థి

దిక్కార స్వరంతో

నైజాం నిరంకుశ పాలనపై

నినదించిన ధీరుడు

స్వాతంత్రోద్యమ

కదనరంగంలో

కలం పట్టి కదం త్రొక్కి

పదం పాడిన ఘనుడు

రాజకీయ అస్థిరత్వంలో

పగ్గాలు చేపట్టి

స్థిర పాలన అందించిన

గొప్ప పాలకుడు

మహా మేధావి

బహుభాషా కోవిదుడు

సరస్వతీ పుత్రుడు

నిగర్వి అపర చాణక్యుడు

ప్రపంచ దేశాలలో

తెలుగు తేజాన్ని తెలంగాణ కీర్తిని

రెపరెపలాడించిన వాడు

ఆర్థిక సంస్కరణలో అందెవేసిన చెయ్యి

మహా పాలకుడిగా

పాములపర్తి వెంకట నరసింహారావు

ముద్దుగా పిలుచుకుంటున్న

పీవీ నరసింహారావుకివే మా నివాళులు

– కట్టెకోల చిన నరసయ్య, 7981814784

Related posts

ప్రగతి దివ్వెలు

Satyam NEWS

నాన్న అన్న పిలుపు

Satyam NEWS

ఓం అస్మత్ గురుభ్యోనమః

Satyam NEWS

Leave a Comment