39.2 C
Hyderabad
May 3, 2024 11: 18 AM
Slider కవి ప్రపంచం

తొలకరి జల్లులు

#Puli Jamuna

ప్రచండ భానుని ప్రతాపంతో

చుక్కనీరు కరువైన చెరువులు

దాహార్తితో నోళ్ళు తెరచిన బీళ్ళు

నెర్రెలుబారిన వాగులు వంకలు

బావురుమంటున్న  బావులతో

పుడమితల్లి తల్లడిల్లే వేళ

ఉరుములు మెరుపులతో

కరిమబ్బులు కరిగి పోయి

శీతల పవనాలతో పలకరిస్తూ

తొలకరి జల్లు భువిని చేరగా

వేసవి తాపంతో వేసారిన

జనుల మనసు సాంత్వనమొందె

మట్టి పరిమళాలు గుభాళించగా

అన్నదాతల హృదిలో విరిసిన

ఆనందం అంబరాన్ని చుంబించగా

రైతన్నలు హలంచేత బట్టి

పొలం బాటన పయనించిరి

ప్రకృతి పచ్చదనంతో పరవశిస్తూ

ఉప్పొంగే జల వనరులతో

నవ చైతన్యంతో తొణికిసలాడింది

చెట్లు చేమలు పాడిపంటలతో

పసిడి సిరులతో విలసిల్లాలని

వ్యవసాయ పనిముట్లను శుభ్ర పరచి

పశువులను అందంగా అలంకరించి

కర్షక వీరులు దుక్కిదున్ని  నాట్లు వేస్తూ

ఏరువాకను వైభవంగా జరిపే శుభతరుణం

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682.

Related posts

ఒక్క రోజే 100 కేసులు…బెంబేలెత్తిపోతున్న ప్ర‌జ‌లు..

Satyam NEWS

పెట్రోల్ దాడులు చేస్తున్నా ఆగని అవినీతి

Satyam NEWS

ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవం

Satyam NEWS

Leave a Comment