29.7 C
Hyderabad
May 2, 2024 06: 38 AM
Slider కవి ప్రపంచం

కార్తీక మాసం

#PVS Krishnakumari

తన చల్లని కిరణాలతో

అగ్ని స్వరూపిణి యైన

తన నెచ్చెలి ‘కృత్తిక’ ను

చ్చల్లబరిచేందుకు

ఆమెని సమీపించాడు

శశాంకుడు

భక్తి పారవశ్యం లో ముంచే

ఈ కార్తీకమాసంలో,

ఎటుచూసినా

దీపకాంతుల శోభలతో

శివనామ స్మరణలతో

భువి మరో కైలాసాన్ని

తలపిస్తోంది

ఆకాశదీపాల శోభను చూసి

నింగిలోని తారకలు

మాకు పోటీగా

మరో నక్షత్ర మండలమా

అని విస్మయం చెందుతున్నాయి

ఎప్పుడూ  భక్తుల కోలాహలంతో

ఉండే నదీనదాలు,

బంధుమిత్రుల

ఆనందోత్సాహాలతో

కళకళలాడే వనాలు కూడా

నేడు నిశ్శబ్ద ముద్రలో

మునిగిపోయి

కార్తీక శోభను తిలకిస్తున్నాయి

తిమిర సంసారం చేస్తూ

భక్తి భావాన్ని పెంపొందించే

ఈ కార్తీక దీపాలు

కొత్త ఆశలకి ఊపిరినిస్తున్నాయి

పీ.వీ.యస్. కృష్ణ కుమారి, 9494510994

Related posts

20న కొల్హాపూర్ కు ప్రియాంక

Bhavani

పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్లు జైలు శిక్ష‌

Satyam NEWS

మంత్రి సత్యవతి రాథోడ్ కు జన్మదిన శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment