37.2 C
Hyderabad
May 2, 2024 12: 55 PM
కవి ప్రపంచం

పవిత్ర కార్తీకం

#Vedardham Madhusudhana Sharma New

సకల శుభకరం కార్తీక మాసం.

శివకేశవులకు ప్రీతికరం ఈ మాసం.

కృత్తికా నక్షత్ర యుక్తం ఈ కార్తీకం.

అగ్ని  ఆరాధనతో తొలగును అరిష్టం.

పర్వదినాలకు నిలయం ఈ కార్తీకం.

అజ్ఞానాన్ని తొలగించి,విజ్ఞాన జ్యోతులు పంచే దీపారాధన,దీపదానం

కార్తీకంలో ఎంతో ముఖ్యం.

పితృ ఆరాధన,పురాణ పఠనం, శ్రవణం వల్ల ఎంతో ఫలం.

నదీ స్నానం,సాలగ్రామ పూజ,వన భోజనాలతో శ్రేయస్కరం.

కార్తీక సోమవారాలు శివునికెంతో ప్రీతికరం.

అభిషేకం,బిల్వార్చనలతో కలుగును శివ సాయుజ్యం.

ధాత్రి,తులసిల కళ్యాణంతో కలుగును

కార్తీక దామోదరుల అనుగ్రహం.

భగినీ హస్త భోజనంతో

సోదరీసోదరుల అనుబంధం పదిలం.

ఆకాశదీప దర్శనంతో మన ఆలోచనలు శాశ్వతం.

నాగ దోషం,సర్ప బాధలను తొలగించే నాగారాధనతో విశేష ఫలం.

కార్తీక వన భోజనాలతో

ఆనందం,ఆరోగ్యం,బంధుత్వాలు ధృడం.

న కార్తీక సమో మాస:: అన్న పెద్దల మాటను పాటిద్దాం.

కార్తీకంలో వివిధ దేవతారాధనలతో సకల శుభాలను పొందుదాం.

వేదార్థం మధుసూదన శర్మ, 9063887585.

Related posts

యోగ నరసింహుడు

Satyam NEWS

పుణ్యధాత్రి

Satyam NEWS

బోనాల వైభోగం

Satyam NEWS

Leave a Comment