38.2 C
Hyderabad
April 28, 2024 22: 15 PM
Slider కవి ప్రపంచం

పుణ్యధాత్రి

#K.Haranath New Photo

స్వతంత్ర భారత

అమృతోత్సవ మహోత్సవ

శుభ తరుణారుణ

కిరణ మధురక్షణాలివి

రణ వీరుల పుణ్యధాత్రి

అమరవీర త్యాగధనుల

ఆత్మార్పణ ఫలితమిది

నవ్య భారత జననీ

నమో దివ్య ధరణి

ఉద్యమమే ఊపిరిగా

ఉద్వేగం ఉషస్సుగా

ధ్వజమెత్తిన ధీర పుత్రుల

రత్నగర్భ భరతావని ఇది

ఇట…

అల్లూరి కంటి మంటలు

ఆవిర్లై ప్రజ్వలింప

భగ భగ మండే అగ్నిజ్వాలల

భగత్ సింగ్ చరిత పుటలు

తెల్లదొరల గుండెల్లో

ఫిరంగులై మ్రోగంగా

అమృతోత్సవామృత                         

ఘడియలివి

పరదాస్య శృంఖలాల

విచ్ఛేదనకై శంఖము పూరించగా

శాంతి యోధులు

సమర దూతలు

జాతి నేతల సాక్షిగా

ఉద్భవించిన

జయతంత్ర కేతనమిది

అమ్మా…

స్వతంత్ర భారతి

వందనమమ్మా వందనం

శతకోటి వందలాది

వందనములు

గైకొనుమమ్మా అక్షరాంజలి

అమృతోత్సవ మహోత్సవ

శుభ తరుణారుణ

కిరణ మధురక్షణాన

(స్వతంత్ర భారత అమృతోత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం లో చదివిన కవిత)

కె.హరనాథ్, 9703542598

Related posts

అరుణాచల్‌లో భారత భూభాగ సమీపంలో డ్రాగన్ గ్రామాలు

Sub Editor

మద్యం ఉద్యోగుల్ని దోచుకుంటున్న రెడ్డి ఎంటర్ ప్రైజెస్

Satyam NEWS

తిరుమల బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment