40.2 C
Hyderabad
May 2, 2024 15: 11 PM
Slider విజయనగరం

చినజీయర్ పర్యటన తర్వాత టెంపుల్స్ పై పోలీసులు మరింత దృష్టి…!

#SPVijayanagaram

రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన రాములోరి శిరస్సు ఖండన అంశం…త్రిదండి చినజీయర్ పర్యటన తర్వాత మరింత ప్రాధాన్యత పెరిగింది. రామతీర్థం నీలాచలం కొండను సందర్శించిన చిన జీయర్..దేవతా మూర్తులను ఏడాది లోపు ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్టింప చేయాలని ఆదేశించారు.

అలాగే దేవాలయాలలో భక్తుల సంచారం, సీసీ కెమరాల ఉండే విధంగా దేవాదాయ, పోలీసు శాఖలు చూసే విధంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం తగు ఆదేశాలు ఇవ్వాలని చిన జీయర్ సూచించారు.

చిన జీయర్ నీలాచలం కొండ వద్ద మీడియా తో మాట్లాడిన సుమారు ఏడుగంటలలో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ అకస్మాత్తుగా దేవాలయాల వద్ద భద్రతను అకస్మాత్తుగా వెళ్లి పరిశీలించారు.

ముఖ్యంగా ఇటీవల జరిగిన దొంగతనాలు ,విగ్రహాల అపహరణ వంటి ఘటనలను దీనికి తోడు త్రిదండి చినజీయర్ సూచనలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారీ నగరంలో ప్రముఖ దేవాలయాలను అర్ధరాత్రి పరిశీలించి… ఆలయ అర్చకులు, రాత్రి పూట గస్తి ,సీసీ కెమాల ఏర్పాటు, దేవాలయానికి రక్షణ వంటి అంశాలపై స్థానికులతో అక్కడిక్కడే పరిశీలించి చర్చించారు.

ఏదైనా రామతీర్థం నీలాచలం కొండపై చినజీయర్ పర్యటన అంశం అటు దేవాదాయ శాఖ ఇటు పోలీసు శాఖ భద్రత, రక్షణ పట్ల శ్రద్ధ చూపెడుతున్నాయనే చెప్పాలి.

Related posts

ఆధిపత్యం కోసమే రాజాంలో హత్య: 24 గంటల్లో నిందితుల అరెస్టు

Satyam NEWS

గరళ కంఠాయనమహ: ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలి?

Satyam NEWS

ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే హుజూర్ నగర్ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment