37.2 C
Hyderabad
April 26, 2024 22: 30 PM
Slider కవి ప్రపంచం

నీళ్ళాట – ఓ జీవన చక్రం

#Kondapally Niharini

బొంగరం తిరిగిన నేలపై గుండ్రనైన గుర్తు

ఆటలేవీ ఒక్కటి కాదు

అమ్మ కడుపు సరస్సు ఈత కూడా!

అవును! తొమ్మిది నెలల నమ్మిక నేర్పిన నిజం

ఏడుపునెంటేసుకొని ఒచ్చేది

నవలోక విన్యాసాలు చూడ

తెంపలేని పేగుబంధం తెగింపు

తొలికేకల ఏడుపు వినాలనే

కాన్పు పూత పూయాలనే!

సహజమైందో కృత్రిమమైందో

ఎంపికేదైనా ప్రాణం కోసమే

కత్తులు కటార్లు బ్రతుకు సంబరాలకి కూడా!

మనిషి పోతే కడుపుకోత అంటరెందుకో !

ఇగ్గోదూ- ఇదే మరి!

చెప్పలేని ఎరుకకు దగ్గరైంది

కోసి తీసిన బిడ్డ లే ఎక్కువ

గద ఇప్పుడు!

తీరొక్క కాల రీతిలో మేలొక్కటుంటే చాలు

పుట్టుక కాఠిన్యమంతా కేరింతలనుండి పేరు పేర్చినంత

ఎదుగుదల వరకు తల్లితండ్రులయిన సంతోషమంతా

తీర్చిదిద్దిన మంచి చెడుల్ని

మరుపు మూటలలో కూర్చి

అమ్మానాన్నలను వదిలేసే వ్యవహారం వరకు

మరవక

మురవక

ఎరుకను ఏలుబడికి తెచ్చుకుంటే

కుట్లు గాట్లు ఎట్లుండేది

చీమునెత్తురున్నోళ్ళకు దెలిసినట్లు సాలుదీరితె బాగుండు

తరాల బాటపై

మూడుకాళ్ళ  నడక

ఒకటేదో యాది బండినెక్కిస్తే

పొట్ట బోసుకున్న ఉమ్మనీటి తత్వమంత

కన్నీరొలకబోసుకున్నప్పటివి  కావని

ఒదిలేస్తున్నరు

ముసలోళ్ళను ముక్కోళ్ళని !

చావుబ్రతుకుల రేవుమీద ఊగిసల తెప్ప

ఎప్పటికప్పుడు తొందరగ తీసుకుపోవడంలేదని దేవుణ్ణి తిట్లదండకాల్లోచూస్తున్నరు

ముందుతరపు మనుషులు

అడ్డాలనాటి బిడ్డలు అత్తమామల బిరుదుల్లో వేదికనెక్కాక  

పూర్తిగ అరిగి పనితీరిన యంత్రాలమని అంటున్నారని దుఃఖ సంద్రంలో మనుగుతున్నారు రక్తముడిగిన యెముకగూళ్ళు

అప్పటి నీళ్ళాట ఇప్పటి కన్నీళ్ళాట

ఒక్కటైనట్టు

ఇంత కనాకష్టంగయ్యిందా జీవన చక్రం

కడుపు చించుకుంటె కాళ్ళమీద పడ్తదన్నదెప్పటి మాటోగాని

కొత్తకొత్తగానే వినిపిస్తున్నదిప్పుడు మధ్యతరంగూడా!

కొండపల్లి నీహారిణి

Related posts

తెలంగాణ నుంచి రెమిడిస్వేర్ ఇంజక్షన్ అక్రమ రవాణా

Satyam NEWS

పి.వి

Satyam NEWS

ఐ డోంట్ లైక్:గడ్డం గీయడు,స్నానం చేయడు విడాకులు కోరిన భార్య

Satyam NEWS

Leave a Comment