32.2 C
Hyderabad
May 2, 2024 01: 00 AM
Slider కవి ప్రపంచం

శ్రమయేవ జయతే

#NellutlaSunitaNew

తరాల నుండి తాతలు ఆస్తిగా ఇచ్చిన దారిద్ర్యాన్ని మూటకట్టుకొని

బరువుల బతుకు బండిని బహువుల పై మోస్తూ

అష్ట భోగాలకు అదృష్టం నోచుకోని ఆమడ దూరపు బతుకులు

ఒంట్లోని రక్తం చుక్కలను శ్రమశక్తి గా మార్చి

విషవాయువులు  పీల్చి   ఆయువులు హరించినా అమలుకు నోచుకోని కార్మిక చట్టాలు

కన్నీటి  చెలమలై చల్లారిన ఆశలు

మారని తలరాతల గీతలు

జీవితంలో రాజీ పడలేక పోరాడుతూనే ఉన్న కార్మికులం

వ్యవసాయాన్ని యాంత్రిక రించి

పారిశ్రామికాన్ని అభివృద్ధి పరచి

శ్రామిక శక్తిని అనిచి వేస్తే ఎలా?

చారిత్రక సామ్రాజ్యాల సంపదల త్యాగనిరతికి చిరునామాలు కాదా మా శ్రమశక్తి

సౌధాల సౌందర్యం కనువిందు చేస్తూ కనిపిస్తుంది అందరికీ

మా రుధిర హస్తాలు ముద్రించిన శ్రమైక సౌందర్యం ఏ నేత్రాలకు కనబడును

పొంగిన ఉద్వేగంతో ఉక్కు పిడికిలి బిగించి

శ్రమ శక్తిని ఆయుధంగా మలిచి

హక్కుల ఉద్యమ పోరుకై సిద్ధమవుదాం

శ్రమయేవ జయతే అంటూ ప్రపంచానికి పరిచయం ముందుకు అడుగు వేద్దాం!!

నెల్లుట్ల సునీత, ఖమ్మం, చరవాణి 7989460657

Related posts

సీఎం జగన్ పై సొంత చెల్లికే నమ్మకం లేదు: పుత్తా

Satyam NEWS

భూ కబ్జా అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ దాడి

Satyam NEWS

పెంచిన వంట గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలి

Satyam NEWS

Leave a Comment