29.7 C
Hyderabad
May 2, 2024 04: 03 AM
కవి ప్రపంచం

శ్రమజీవులం

#PattemVasantha

పొద్దు పొద్దున్నే లేచి

సద్దులు కట్టుకొని

పారా పలుగులు చేతబట్టి

మూటలు నెత్తిన పెట్టుకొని

సూర్యుడు పొడవక ముందే

ఇంటి తలుపు గొళ్లెం పెట్టి

పనుల కోసం పరుగులు

మట్టి పనికి తట్ట పనికి మేమే

కష్టం నమ్ముకొని బతికే వాళ్ళం

తిండి గింజలకు, గుండు పిన్నులకు

అన్నిటి తయారీలో మేమే ఉంటూ

రక్తం కలి కలి చేసుకుంటూ

చెమట చుక్కలు ధారపోస్తూ

బుక్కెడు మెతుకుల కోసం

రేపటి యోచన లేదు

వలస జీవన పోరాటంచేస్తూ

కార్మిక హక్కుల శంఖారావంతో

శ్రమజీవుల స్వేచ్ఛ  కోసమై

వర్గపోరాటానికి బాటలు వేస్తూ

హక్కులకై పోరాడే శ్రమజీవులం

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

నిగర్వి

Satyam NEWS

అతనో పాఠ్యాంశం

Satyam NEWS

జై శ్రీ రామ్

Satyam NEWS

Leave a Comment