కవి ప్రపంచం

నిగర్వి

#Janardhan Mateti

అనితర సాధ్యుడిగా, అమోఘ మేధ సంపన్నుడిగా..

అజేయ రాజనీతిజ్ఞుడిగా, బహు భాషా కోవిదుడిగా..

జగమెరిగిన సాత్వికుడిగా, జ్ఞాన పీఠాధి రోహితుడిగా,

బహు ముఖ ప్రజ్ఞాశాలిగా,

అలుగుటయే ఎరుంగని అజాత శత్రువుగా,

తెలుగు బిడ్డగా, తెలంగాణలో నడియాడి

రాజకీయ పరిపక్వతతో ప్రధాని పదవినధిరోహించి

దేశ ఆర్థిక వ్యవస్థను తనదైన శైలిలో గాడిలో పెట్టి

ప్రపంచ ఆర్థికవేత్తల నబ్బురపరిచి

కుటుంబ పాలనా సంస్కృతికి చరమ గీతం పాడి

ఆశిత్ర పక్షపాతియను ముద్రిడుగొని

జీవిత చరమాంకములో సామన్య జీవితాన్ని గడిపి

ఈ సమాజానికి, సంఘానికి, దేశానికి

నిర్లిప్త ఆచరణీయ సందేశాన్నిచ్చిన

వంగర గ్రామ బిడ్డ

ఓరుగల్లు చరితను, చరిత్ర పుటలలో

పదిల పరిచిన ఓ నిగర్వి, మాకు దూరమై

వంద వసంతాలు పూర్తి చేసుకుని

అందరి మనస్సులలో పదిలమైన ఓ పాములపర్తి

వందనమిదే నీ స్మృతికి జ్ఞాపక తోరణంగా

అభివందనమిదే ఓ అభినవ నరసిం హ

వందనం… అభివందనం.. అభివందనం..

జనార్ధన్ మాటేటి, విశ్రాంత డిప్యూటి సూపరింటెండెంట్, టి.ఎస్.ఆర్.టి.సి, హైదరాబాద్

Related posts

ఎవడాపగలడు ?

Satyam NEWS

కాలమహిమ!

Satyam NEWS

బోనాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!