40.2 C
Hyderabad
May 2, 2024 19: 01 PM
Slider కవి ప్రపంచం

అమ్మ

#PVS Krishnakumari

అనంత నీరవ నిశీధి

కనులు తెరవలేను  కదలలేను

భరించరాని దుర్గంధం వల్ల

యోగనిద్రలో ఉన్న నాకు

వినిపించిందో అద్భుత గానం

అమృత పలుకులు

ఆపాట, మాట అమ్మవి

నాలోని నైరాశ్యం పోయింది

నాకు కావలసినవన్నీ ఇచ్చింది

తన నోటితో ఆహారాన్నిచ్చింది

తన శ్వాస లో సగం నాకు ఇచ్చింది

తాను నరక బాధను అనుభవిస్తూ

బ్రహ్మ సృష్టి కి ప్రతి సృష్టి చేస్తూ

ఆ చీకటి మురికి కూపం నుండి

నన్ను వెలుగులోకి తెచ్చింది

తను పాడే జోలపాట

నాకు జీవిత పాఠాలను నేర్పింది

తన ఒడి నాకు ఎనలేని

ధైర్యాన్ని ఇచ్చింది

కంటికి కనపడక, విశ్వమంతా

వ్యాపించి ఉన్న ప్రాణాధారమైన

స్వచ్ఛమైన గాలి వంటి అమ్మ ప్రేమ

ఓ అద్భుత శక్తి

అదే నా ధైర్యం ,

అదే నా విజయం

(మాతృ దినోత్సవం సందర్భంగా)

పీ.వి.యస్.కృష్ణకుమారి

Related posts

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన గద్వాల డిఎంహెచ్ఓ

Satyam NEWS

నిర్మల్ పట్టణంలో తడి పొడి చెత్త ఇక సపరేటు

Satyam NEWS

ఇస్లామిక్ టెర్రరిస్టుల్లా ప్రవర్తిస్తున్న రష్యన్ సైనికులు

Satyam NEWS

Leave a Comment