38.2 C
Hyderabad
April 29, 2024 13: 42 PM
కవి ప్రపంచం

నిండుకుండ

#Ramadevi Kulkarni

ఎంత అబ్బురమయ్యా
అంత ఎత్తుకెదిగి కూడా
ఇంతలా ఎలా ఒదిగివుంటివి
వాగ్దేవి నీ వాక్కునుండేనా
లెక్కకుమిక్కిలి వాక్కు లిచ్చెను
వీరభద్రుడే నీ గుండెలుండెనా
పంజాబుకు జవాబిచ్చి
కాశ్మీరుకు సమాధానమైతివి
రాజ్యపాలన ఒకదిక్కు
సాహితీ సేద్యమొకదిక్కు
దిక్కులేనివారికి సదా దిక్కు
మొక్కవోని ధైర్యం నీ నైజమా
ప్రాగ్పశ్చిమ తేజో పుంజమా
తెలుగు జాతి విజయ  కేతనమా
జ్ఞానపీఠమెక్కున భారతరత్నమా
నిండుకుండ నిరాడంబర వ్యక్తిత్వమా
నిను మరవదు ఈ జాతిసుమా…. !!.

రమాదేవి కులకర్ణి 8985613123

Related posts

క‌వితాసేనాని…

Satyam NEWS

మహా ప్రస్థానం

Satyam NEWS

కార్తీక శోభ

Satyam NEWS

Leave a Comment