38.2 C
Hyderabad
April 29, 2024 13: 35 PM
Slider కవి ప్రపంచం

తేజోనిధికి వంద‌నం…

#TirunagariSrinivasNew

అజ్ఞాన‌పు చీక‌టిని
త‌రిమేసే సూర్యుడు
స్వ‌యం ప్ర‌కాశ‌కుడు
తేజోదీపంలా వెలిగే
జ్ఞాన భాస్క‌రుడు ఉపాధ్యాయుడు
భ‌విష్య‌త్తును నిర్దేశించే మార్గ‌ద‌ర్శి
భ‌రోసాను అందించే చైత‌న్యమూర్తి
ఆత్మ‌బ‌ల‌మై నిలిచే ఆద‌ర్శ స్ఫూర్తి
గురువే లేకుంటే
విశ్వ‌విజ్ఞానానికి అర్థ‌మే లేదు
కొవ్వొత్తిలా క‌రిగి వెలుగును
ప్ర‌సాదించ‌కుంటే రేప‌టి
జీవితం కాంతివంతం కాదు
ఆ అద్వితీయ‌త‌ను గురించి
ఏం చెప్పినా, ఎంత కొనియాడినా త‌క్కువే
గురూనాం గురుః
ఆ మార్గ‌ద‌ర్శికి వంద‌నం
ఆ తేజోమూర్తికి స‌హ‌స్ర ప్ర‌ణామం.
(ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా…)

డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్, 8466053933

Related posts

ఏపి ఇన్ చార్జి సీఎస్ గా విజయానంద్

Satyam NEWS

నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు

Bhavani

తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా

Satyam NEWS

Leave a Comment