39.2 C
Hyderabad
April 28, 2024 12: 17 PM
Slider కవి ప్రపంచం

బోనాలు

#Purimalla Sunanda Khammam

ద్రావిడ సంస్కృతి సంప్రదాయాలను  అనాదిగా అనుసరిస్తున్న

ప్రజల నమ్మకాలకు ఊపిరి పోసి

నాటి నుంచి నేటివరకు సజీవంగా నిలిపిన అమ్మవార్ల బోనాలు!¡

ఐకమత్యాన్ని సంఘ బలాన్ని  తెలిపే  అపురూపమైన బోనాలు!

పోచమ్మ  కట్టమైసమ్మ, ఎల్లమ్మ మాంకాళమ్మలు ఆరాధ్య దేవతలకు

గండదీపమెత్తి

నెత్తిమీద  ఎత్తుకున్న అన్నం బోనం

పసుపు కుంకుమలు వేపమండల అలంకారంతో  పటువను సింగారించి

పాయసాన్నాలను నైవేద్యంగా పెట్టి

పిండి దీపాలను దండిగా వెలిగించి

చూసేవారికి కన్నుల పండువగా

బాజా బజంత్రీలు మేళతాళాల నడుమ అమ్మోర్ల గుడులకు

ఊరు ఊరంతా కదిలిపోయే చూడముచ్చటైన బోనాలు!

పోతురాజు శివసత్తులు

కాళ్ళకు గజ్జెలు కట్టుకొని

శివాలెత్తి ఊగంగా

కోరిన కోరికలేవో పూనకంలో చెప్పంగ

కోరిన వరాలిచ్చే అమ్మవార్లను

ఇంటి ఆడపడుచుగా ప్రేమను పంచి

భక్తితో సమర్పించుకునే

చీర సారె  నైవేద్యంతో

కళకళలాడే ఆషాఢం  బోనాలు!

తెలంగాణ ఆడపడుచుల బోనాల పబ్బతి

దుష్టశిక్తులను దునుమాడమని వేడుతూ

శిష్ట రక్షణ చేయమని కొలిచేటి

తెలుగు వారి ఘనమైన సంస్కృతి

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారు

Satyam NEWS

మిత్రులతో గొడవలు: యువకుడు ఆత్మహత్య

Satyam NEWS

ఉత్త‌రాంధ్ర‌పై గులాబ్ తుపాను ప్ర‌భావం….!

Satyam NEWS

Leave a Comment