42.2 C
Hyderabad
April 26, 2024 16: 33 PM
Slider కవి ప్రపంచం

సంక్రమణం

#M Anasuya

సూర్యుడి మకర రాశి ప్రవేశంతో

క్రమంగా ఉత్తరాన పుణ్యకాలం ప్రారంభం కాగా …..

ముక్కారు పంటల ధాన్యపు సిరి …..

ఇంటింటా కొలువై ఉండగా…

పలకరింపుల పలకరింతలు

పులకరింతల పరవశాలు

భోగిమంటలు వెచ్చదనాలు

ప్రతికూల ఆలోచనలు పనికిరాని

పాత వస్తువులు దగ్ధం కాగా….

సానుకూల ఆలోచనలను ఒడిసిపట్టంగా

ఆశయాలు ఉన్నతంగా ఉండాలని

సూచించే గాలిపటాల రెపరెపలు …

గగనంలో విరిసే రంగురంగుల కుసుమాలు..కనువిందు చేయగా

డోలు సన్నాయి రాగాలకనుగుణంగా

గంగిరెద్దుల నృత్యాల రమణీయాలు…

రాగి అక్షయపాత్ర తలపై నుండగా

హరిలో రంగ హరి అంటూ హరిదాసు కీర్తనలు …

కంచు గజ్జల ఘల్లు ఘల్లుల స్వరాలు…..

ముంగిట్లో చుక్కల రంగవల్లులు

రాత్రి వేళలో కనిపించే తారలకు

చిహ్నంగా చుక్కల చుట్టూ

తిరుగుతూ చుక్కలను గళ్ళల్లో ఇమిడ్చేముగ్గు!!….

ఖగోళంలో కనిపించే మార్పులకు సంకేతం కాగా …..

కనుమనాడు వేసే రథం ముగ్గు

అందరూ ఒకరికి ఒకరు తోడంటూ…

రథం ముగ్గు తాడును మరొక ఇంటి

ముగ్గుతో కలుపుతూకలయికను…..

చిన్నారులను భోగిపండ్ల దీవెనలతో

అందరి మోము లో చిరునవ్వులు పూయంగా ….

ముగ్గు మధ్యలో ఉంచే గొబ్బెమ్మలు

గోపీనాథుడిని, గోపికలను గుర్తు చేస్తుండగా ….

భక్తి పారవశ్యం ఉప్పెనల పొంగి

తనువు మనసు పులకరింతల

పరవశాలు ఇంటింటా ప్రతి ఇంట వెల్లి విరియంగా…

సంక్రమణ వెలుగు కాంతులు

విశ్వమంతా నిండి ఉండంగా….

మది మందిరము ఆనందము కాదా!!!!…..

ఎం. అనసూయ, సైదాబాద్ మండలం, హైదరాబాద్

Related posts

ములుగు జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను తెరవాలి

Bhavani

ఇంగ్లీష్ మీడియం బోధనే ఉంటుంది…మారదు

Satyam NEWS

బలమైన దేశం కోసమే పని చేస్తున్న బీజేపీ

Satyam NEWS

Leave a Comment