జూనియర్ అడ్వకేట్లకు నెలకు 5 వేల చొప్పున భృతి కోసం ఉద్దేశించిన వైఎస్ఆర్ లా నేస్తం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో నమోదై కనీసం మూడేళ్లు నిండిన వారు దీనికి అర్హులు. ఈ పథకానికి ఎంపిక అయిన వారికి జనవరి 1నుంచి పంపిణీని ప్రారంభించి మొదటి మూడేళ్లు మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ పథకం ప్రకారం జూనియర్‌న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చెల్లిస్తారు. ప్రస్తుతం ఏపీ బార్ కౌన్సిల్‌లో 61 వేల మంది న్యాయవాదులు ఉన్నారు. అదే విధంగా కొత్తగా బార్‌కౌన్సిల్‌లో ఏటా 1500 మంది పేర్లు నమోదు చేసుకుంటారు. ఎన్ రోల్ మెంట్ ధ్రువపత్రం ఆధారంగా మొదటి మూడేళ్లు చెల్లింపులు చేస్తారు. అయితే కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలున్నవారికి ఈ పథకం వర్తించదు. అదే విధంగా 35 ఏళ్లు దాటితే పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టీకరించింది.
previous post