29.7 C
Hyderabad
April 29, 2024 07: 45 AM
Slider విజయనగరం

హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాలు కాపాడుకోండి..అంటున్న ట్రాఫిక్ పోలీసులు

#TrafficPolice

కరోనా రెండో వేవ్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే పీఎం మోడీ ఈ విషయమై 8 రాష్ట్రాల సీఎంవతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి..అందుకు తగిన విధంగా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.

అయితే అటు దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఈ అయిదో విడత లాక్ డౌన్ అన్నీ తెరచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను కూడా ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలలో అన్నీ తెరచుకుని కార్యకలాపాలు కొనసాగుతున్న వేళ…కొన్ని జిల్లాల్లో అథికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

అలాగే దాదాపు ఎనిమిది నెలలుగా తిరగని అన్ని వాహనాలు రోడ్డు మీద శరవేగంగా తిరుగుతున్నాయి. తదనుగుణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలోని ట్రాఫిక్ విభాగం అవేర్నస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

వారం రోజుల పాటు హెల్మెట్ అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా విజయనగరం లో రెండోరోజు హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన చర్యలు చేపడుతున్నారు.

ఈమేరకు ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు, సీఐ ఎర్రంనాయుడు, ఎస్ఐలు జియాయుద్దీన్, భాస్కరరావు, హరి ప్రసాద్ లతో నగరంలో ని ప్రధాన జంక్షన్ల వద్ద హెల్మెట్ ధరించకపోవడం వరన కలిగే నష్టాలు గుర్తించి తెలియజెప్పే యత్నం చేసారు.

ఈ మేరకు నగరంలో బాలాజీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐలు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వాహనాలపై హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాహన చోదకులను వెనక్కి పంపించే చర్యలు చేపట్టారు.

దాదాపు గంట సేపు ఈ చైతన్య చర్యలు చేపట్టారు. చాలామంది ఉద్యోగస్థులు ,కాలేజీ విధ్యార్ధినీ విద్యార్థులు ఓక వైపు మాస్క్ పెట్టుకోకుండా మరో వైపు హెల్మెట్ లేకుండా వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు వారిని అవేర్నస్ చేసే కార్యక్రమం నిర్వహించారు.

కొసమెరుపు ఏంటంటే… హెల్మెట్, మాస్క్ లు పెట్టుకోని వాళ్లలో ఖాకీలుండటం శాఖకే మచ్చ తెచ్చి పెడుతోంది.

Related posts

తెలుగు తెరకు తిరుగులేని విలన్: హ్యారి జోష్

Satyam NEWS

విద్యార్ధులపై వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దౌర్జన్యం

Satyam NEWS

Protest: పలుచోట్ల విజయవంతమైన జాతీయ బంద్

Satyam NEWS

Leave a Comment