29.7 C
Hyderabad
May 2, 2024 06: 45 AM
Slider కవి ప్రపంచం

వైపరిత్యం

#PVS Krishnakumari

నేను లేలేత ప్రాయంలో ఉన్నప్పుడే

నా జనని నన్నో కోరిక కోరింది

కన్నా,…

నామీద ఆధారపడి ఉన్నవాళ్ళకి

నీవు ప్రాణవాయువు కావాలంది

తల్లి కోరిక తీర్చటమే‌నా కర్తవ్యం

నాలాగే మరెందరికో ఆమె జన్మనిచ్చింది

మా అందరి ఆశయం ఒకటే

అమ్మ కోరిక తీర్చాలి

మమ్మెవరు పట్టించుటించుకోకున్నా

మా తల్లి ఇచ్చిన ఆత్మ స్థైర్యం తో

స్వయం కృషితో ‌ఎదిగాము

మేము బాగుంటేనే అందరూ

బాగుంటారని భ్రమించాము

ఆహారాన్ని ఇచ్చాం, గూడూ,నీడా ఇచ్చాం

మధుర ఫలాలనిచ్చాం , మధువు నిచ్చాం

ఇన్నెందుకు, వాళ్ళకి ప్రాణవాయువు

మేమే అయినాము

శిశిరం లో మా జవసత్వాలు ఉడిగినా

వసంతం రాగానే మళ్ళీ రెట్టించిన

ఉత్సాహంతో,‌ కార్యోన్ముఖులమయినాం

మాతో అవసరం లేదనుకున్నారేమో

మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు

అంతేనా…

మా తలలు తెగ నరికారు

కూకటివేళ్లతో పెకలించారు

అయినా బాధ పడలేదు

వాళ్ళ అమాయకత్వం అనుకున్నాం

కానీ…..

నేడు ఊపిరందక, ఎగిసిపడుతూ

‘ఆక్సిజన్, ఆక్సిజన్’ అంటూ

ప్రాణాలు విడుస్తుంటే

చూస్తున్న మా గుండె పగిలిపోయింది

మాతల్లి ధరణిమాత బాధ వర్ణనాతీతం

నిస్వార్ధ సేవ చేసిన మమ్ము గుర్తించక

కృత్రిమ ప్రాణవాయువు

కర్మాగారాల్లో తయారుచేయటం

ఆహా…..

ఏమి వైపరిత్యం…

పీ.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

మంత్రి పువ్వాడను కలిసిన హరికృష్ణ

Bhavani

మాగంటి బాబు కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

Satyam NEWS

బిర్యానీలో వెంట్రుకలు వచ్చినందుకు లక్ష జరిమానా

Satyam NEWS

Leave a Comment