40.2 C
Hyderabad
April 26, 2024 13: 06 PM
Slider ముఖ్యంశాలు

జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలు బలోపేతం

#SBIfoundation

జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు SBI ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు CCMB జెనోమిక్స్ గైడెడ్ పాండమిక్ ప్రివెన్షన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది. దీనితో బాటు మరో రెండు శాటిలైట్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు.

దీని కోసం SBI చైర్మన్ దినేష్ ఖరా సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ నందికూరికి రూ. 9.94 కోట్ల చెక్కును నేడు అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ ఖరా మాట్లాడుతూ, “భారతదేశం జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అమూల్యమైన డేటాను అందించడానికి SBI ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జెనోమిక్స్ గైడెడ్ పాండమిక్ ప్రివెన్షన్‌ను ఏర్పాటు చేయడంలో CSIR-CCMB కలసి వచ్చిందుకు సంతోషం వ్యక్తం చేశారు. దేశం COVID-19 మహమ్మారి నుండి సవాళ్లను ఎదుర్కోవడంలో సమాచారం, డేటా ఆధారిత నిర్ణయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ప్రపంచాన్ని ధ్వంసం చేస్తూనే ఉన్న ఈ ప్రాణాంతక వైరస్‌తో పోరాడటానికి సమయం చాలా ముఖ్యమైన అంశమని ఖరా చెప్పారు.

SBI ఫౌండేషన్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగం అని ఖారా తెలియజేసారు. ఇది దాని CSR కార్యకలాపాలను, అలాగే దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలను నిర్వహించడానికి 2015లో ప్రారంభించబడింది. భారతదేశం ప్రీమియర్ బ్యాంక్ CSR విభాగంగా, SBI ఫౌండేషన్ అది సేవలందిస్తున్న కమ్యూనిటీలకు, ముఖ్యంగా సమాజంలోని బలహీన అట్టడుగు వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమంలో ముంబై SBI కార్పొరేట్ సెంటర్ DMD & CDO ఓ పి మిశ్రా, హైదరాబాద్ DMD, IAD ఆర్ విశ్వనాథన్, MD SBI ఫౌండేషన్ మంజుల కళ్యాణ సుందరం తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల శ్రీ‌వారికి కానుక‌గా స్వ‌ర్ణ శంఖుచ‌క్రాలు

Satyam NEWS

అశోక్ గజపతి రాజును మళ్లీ అవమానించిన ప్రభుత్వం

Satyam NEWS

ఇంచార్జి ఎంపీపీగా ఉరుదొండ నరేష్

Satyam NEWS

Leave a Comment