37.2 C
Hyderabad
May 1, 2024 13: 26 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో స్కానింగ్ సెంటర్ లను తనిఖీ చేసిన వైద్య శాఖ

#scanningcenter

వనపర్తిలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ దగ్గర గల మానిక్ డయగ్నోస్టిక్(స్కానింగ్)సెంటర్ ను వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ రవి శంకర్ తనిఖీ చేశారు. స్కానింగ్ డాక్టర్ లేరని,స్కానింగు రిజిస్ట్రేషన్ లో నమోదు ఆయిన డాక్టర్ ఉండాలని, ఫైర్ సేఫ్టీ సీలిండర్ దాచి పెట్టారని గుర్తించారు. రోగులకు సంబంధించిన రిజిస్టర్ మైంటన్ చేయలేదు.సిటీ.స్కానింగు నివేదిక ప్రతి నెల డిఎంహెచ్ఓ కార్యాలయానికి పంపలేదు.

పొరపాట్లు సరిదిద్దుకోవాలని డాక్టర్ రవి శంకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి చంద్రయ్య, మధు,నర్సింహ రావు పాల్గొన్నారు. కాగా వనపర్తి మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అఖిలపక్షం కన్వీనర్ సతీష్ యాదవ్ ప్రయివేటు ఆసుపత్రులు,స్కానింగు సెంటర్ల గురించి జిల్లా కలెక్టర్ షేక్ యష్మిన్ భాషకు పిర్యాదు చేశారు. అవసరం లేకున్నా టెస్టింగులు,స్కానింగులకు రెఫర్ చేస్తున్నారని మంత్రులు నిరంజన్ రెడ్డికి,హరీష్ రావుకు పిర్యాదు చేస్తామని సతీష్ యాదవ్ తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

హరీషన్నకు అవమానం చేసిన టిటిడి అధికారులు

Satyam NEWS

చరిత్రను తెలిపే గ్రంధం “తెలంగాణ చరిత్ర తొవ్వల్లో”

Satyam NEWS

డౌట్ క్లియర్: పబ్లిక్ లోకి వచ్చేసిన ఉత్తర కొరియా కిమ్

Satyam NEWS

Leave a Comment