39.2 C
Hyderabad
April 28, 2024 12: 09 PM
Slider హైదరాబాద్

చరిత్రను తెలిపే గ్రంధం “తెలంగాణ చరిత్ర తొవ్వల్లో”

#alisettiprabhakar

ప్రో. శ్రీరామోజు హరగోపాల్ రచించిన తెలంగాణ చరిత్ర తొవ్వల్లో  పుస్తకాన్ని చరిత్రకారులు ప్రో. యాశ్వంత్ రామూర్తి  ఆవిష్కరించారు. డెక్కన్ హెరిటేజ్ అకాడమి  నిర్వహణహలో పర్యావరణ వేత్త, చరిత్ర కారుడు వేదకూమార్ అద్యర్వంలో జరిగిన ఈ పుస్తాకావిష్కరణలో ప్రొ.సల్మా అహ్మద్ ఫరూఖీ,  ప్రొ.అంజన్న,శ్రీరామోజు హరగోపాల్,చరిత్ర కారుడు హైదరాబాద్ యాదే బాతే ప్రెసిడెంట్ అనందర్ రాజ్ వర్మ,ప్రొ.రఘు,తెలంగాణ అకాడమి చైర్మన్ జూలూరు గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ చరిత్ర తొవ్వల్లోపుస్తాకావిష్కారణ చేసిన ప్రో. యాశ్వంత్ రాముర్తి మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయలు భిన్నత్వంలో ఏకత్వం తరహలో ఉంటాయని చేప్పారు. అందులో హైదరాబాద్  నగరం కు ఉన్నా ప్రాముఖ్యత ఎంతో విష్టమైనదని చెప్పారు. ఈ నగరంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఈ పుస్తకం ఉపయోడపడుతుందని చేప్పారు.ప్రభుత్వం కూడ తెలంగాణ చరిత్రను,సంస్కృతులను పరిరక్షించేందుకు చాల కృషి చేస్తూందని, అందుకు ఈ పుస్తకం ఎంతో సహాయకారిగా ఉంటుందని అభిప్రాయ పడ్దారు.

ఈ సందర్బంగా వేదకూమార్ మాట్లాడుతూ…దక్కన్ ప్రాంతం పురాతన కాలం నుండి ఇటీవలి కాలం వరకు గొప్ప చరిత్రను కలిగి ఉంది. తెలంగాణ చరిత్రను, దక్కన్ సంస్కృతులను ప్రజలకు, పాలకులను దృష్టికి  తీసుకువచ్చేందుకు కృషిలో భాగంగానే శ్రీరామోజు హరగోపాల్ రచించిన తెలంగాణ చరిత్ర తొవ్వల్లో  పుస్తకమని అన్నారు.దక్కన్ ప్రాంతంలో ఉన్నా చారిత్రనేపథ్యాన్ని యూనెక్కో గుర్తింపు రావడం గర్వకారణమని చేప్పారు.దక్కన్ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన రాళ్ళు, స్మారక చిహ్నాలు, సరస్సులు, సహజ వనరులను భవిష్యత్ తరాల కోసం సంరక్షించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా ప్రో.సల్మా మాట్లాడుతూ..డెక్కన్ చరిత్రను తెలుసుకునేందుకు కళాఖండాలు, పురావస్తు శాస్త్రం, శాసనాలు, చాలా ముఖ్యమైన భౌతిక ఆధారాలు మరియు గతాన్ని పునర్నిర్మించడానికి రాష్ట్ర చరిత్రలో భాగాలు అని ఆమె అన్నారు.  చారిత్రక అనావాళ్లను నిక్షిప్తం చేస్తూ ఈ పుస్తకరూపంలోకి రావడం  సంతోషకరమని చెప్పారు.ఆమె ఈ పుస్తకం ను వివిధ భాషలను తీసుకురావాలని సూచించింది.

ప్రో. అంజన్న మాట్లడుతూ.. తెలంగాణ చరిత్ర అంటే హైదరాబాద్ చరిత్రే అన్నారు.ఇందులో 21 అర్టికల్స్ 18 శాసనాలు ఉన్నాయని చేప్పారు.సాధారణ ప్రజలకు, విద్యార్ధులను చాల ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్బంగా  అనంద్ రాజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే పాతబస్తీ మకరందమని చేప్పారు. మరుగున పడిపోతున్నా మన దక్కన్ చరిత్ర, మన హైదరాబాద్ చారిత్ర మన ఆనవాల్లను పైకి తీసుకు వస్తూన్నందుకు వేదకుమార్ కు ప్రో. రామోజు హరగోపాల్ అభినందించారు. ఈ సందర్బంగా జూలూరు గౌరి శంకర్ మాట్లాడుతూ..తెలంగాణ చరిత్ర రాసేందుకు చారిత్రక దారులు వేస్తూన్న పుస్తకమని అన్నారు. శ్రీ శ్రీరామోజు హరగోపాల్ తెలంగాణ యొక్క గొప్ప చరిత్ర మరియు దాని డాక్యుమెంటేషన్ అవసరాన్ని గురించి మాట్లాడారు.

పుస్తకంలోని ముఖ్యమైన అంశాలపై డాక్టర్ ఎస్.రఘు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థలు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

(కె.ప్రభాకర్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ కో ఆర్డినేటర్  Mob: 8106721111)

Related posts

మళ్లీ కీలక స్థానంలోకి వచ్చేసిన కె ఎస్ జవహర్ రెడ్డి

Satyam NEWS

చంద్రబాబుపై రాళ్ల దాడి: స్థానిక పోలీసులపై చర్యలు తప్పవా?

Satyam NEWS

సాగు చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్‌ అల్టిమేటం

Sub Editor

Leave a Comment