30.7 C
Hyderabad
April 29, 2024 06: 16 AM
Slider ఆదిలాబాద్

క్లీన్ విలేజ్: 29 తేదీ లోగా ప్రతి గ్రామంలో చెత్తను తొలగించాలి

adilabad

పల్లె ప్రగతి లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశానవాటికల నిర్మాణపు పనులు సోమవారం నుండి తప్పనిసరిగా మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశం లో ఆయన పాల్గొన్నారు.

పల్లె ప్రగతి లో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక కోసం స్థలాలు ఎన్ని వాటికి ఉన్నవి ఇంకా ఎన్ని వాటికి స్థలాలు కావాలని మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ స్మశాన వాటికలకు స్థలం లేని గ్రామాలకు అటవీ భూములను తీసుకొనుటకు సాయంత్రం లోగా అటవీశాఖకు ప్రతిపాదనలు పంపించి ఆదివారం లోగా స్థలం తీసుకొని సోమవారం నుండి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక నిర్మాణ పనులను తప్పనిసరిగా మొదలు పెట్టాలని ఆదేశించారు.

ఎక్కడైతే డంపింగ్ యార్డ్, స్మశానవాటిక కోసం స్థలం లేదో అక్కడ జిపి నిధుల నుండి రెండు రోజుల్లోగా స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని ఎంపీడీవో తహసీల్దార్లను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల కోసం సైట్ లను తహసీల్దార్ నుంచి భూములను సేకరించి పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఈ నెల 20 లోగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ లను కొనుగోలు చేయాలన్నారు.

ప్రతిరోజు ట్రాక్టర్లు చెత్త సేకరణకు  వెళ్లే రూట్ మ్యాప్ లు, సమయం, నిర్వహణకు అయ్యే ఖర్చు తదితర వివరాలు తెలియజేయాలన్నారు ఈ నెల 29 లోగా ప్రతి  గ్రామంలోని ప్రతి వీధిలో, రహదారులు, జాతీయ రహదారుల పక్కన ఉన్న చెత్తను తొలగించాలన్నారు. గ్రామపంచాయతీ బడ్జెట్ లో ట్రాక్టర్, డ్రైవర్, ఇంధనం, మిస్లేనియస్ ఖర్చుల కింద నిధులు కేటాయించాలన్నారు. మండల ప్రజా పరిషత్ అధికారి ప్రతి గ్రామాన్ని వారంలో ఒకరోజు సందర్శించాలని అన్నారు.

ఈనెల 18న జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమ్మేళనంలో జిల్లా పరిషత్  చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొంటారన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి డాక్టర్ సుధాన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆర్ డి వో లు ప్రసూనాంబ, రాజు, పంచాయతీరాజ్ ఎస్.ఈ. సుదర్శన్ రావు, ఆర్ అండ్‌ బి ఈఈ శ్రీనివాస రావు, ఎంపీడీవోలు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇల్లంతకుంట వాగు నీటికి అఖిలపక్షం పాదయాత్ర

Satyam NEWS

మంగళగిరిలో అనుమానితుల సంచారం

Sub Editor

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి అక్షింతలు

Satyam NEWS

Leave a Comment