23.2 C
Hyderabad
May 8, 2024 01: 10 AM
Slider గుంటూరు

నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసిన వ్యాపారులు

nrt seeds

నకిలీ విత్తనాలతో మోసం చేయడమే కాకుండా బాధ్యతారహితంగా సమాధానం చెబుతున్న విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నకరికల్లు మండలం చీమల మర్రి గ్రామ రైతులు ధర్నా చేశారు. నరసరావుపేట లోని లక్ష్మి ప్రియా సీడ్స్ వారి వద్ద 8 వ నెలలో 384 జె జె రకం వరి విత్తనాలు కొనుగోలు చేశారు.

సుమారు 20 మంది కౌలు రైతులు దాదాపు 100 టిక్కీల విత్తానాలు కొనుగోలు చేశారు. ఆ విత్తనాలతో వారు సేద్యం చేయగా వరి పైరు ఏపుగా పెరిగింది కానీ ఎటువంటి ఫల సహాయం ఇవ్వలేదు. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారడంతో ఆ రైతులు వెళ్లి ఇటువంటి విత్తనాలు ఇచ్చావు ఏంటి అని షాప్ యాజమాన్యాన్ని అడిగారు.

దానికి వారు తప్పించుకునే సమాధానం చెపుతున్నారు. దాంతో నష్టపోయిన రైతులు నరసరావు పేట ఎం ఐ ఎం పార్టీ నాయకులతో కలిసి వెళ్లి స్థానిక R D O ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని R D O కు వినతి పత్రం అందచేశారు. తమకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా R D O ను కోరగా సంబంధిత వ్యవసాయ  అధికారికి R D O ఆదేశాలు ఇచ్చారు.

ధర్నా అనంతరం ఎం ఐ ఎం పార్టీ రాష్ట్ర నాయకుడు మస్తాన్ వలి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు నుంచి సాగునీరు లేక రైతులు అనేక ఇబ్బదులు పడ్డారని, ఇప్పుడు సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ నకిలీ విత్తనాల వలన రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేవరకు వారికీ అండగా తమ పార్టీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో నష్ట పోయిన రైతులు ఎం ఐ ఎం పార్టీ నాయకులు మౌలాలి రియాజ్ కరీం ఆరిఫ్ మసూద్ మాదాల నాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్క రోజులో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Bhavani

ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఏం చేస్తాడు?

Satyam NEWS

టీచర్లను ఇబ్బంది పెడుతున్న ఇంటి వద్దకే బడి ఉత్తర్వు

Satyam NEWS

Leave a Comment