40.2 C
Hyderabad
May 2, 2024 18: 24 PM
Slider వరంగల్

టీచర్లను ఇబ్బంది పెడుతున్న ఇంటి వద్దకే బడి ఉత్తర్వు

#TribalTeachers

గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేసిన ఇంటి వద్దకే బడి ఉత్తర్వులు ఉపాధ్యాయులకు ఆందోళన కరంగా మారాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థినీవిద్యార్థులు వందలాది మంది ఉన్నారు.

తండాలు, గూడేల నుంచి  సుమారు 60-70కిలో మీటర్ల దూరం నుంచి వస్తుంటారు. అంత దూరం వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించమనడం టీచర్లను ఇబ్బందులకు గురిచేయడమేనని దళిత, గిరిజన టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా శాఖ వ్యాఖ్యానించింది.

జిల్లా అధ్యక్షులు పోరిక సర్వన్ కుమార్,  ప్రధాన కార్యదర్శి పోరిక జయరాం నాయక్,  కార్యదర్శులు మూడ్ కసన్ సింగ్, పోరిక రాం కుమార్, అజ్మీరా రాజు, రాజారామ్, రఘురాం, పోరిక మదుకుమార్, భూక్య మోహన్, గోపిసింగ్, ఇస్లావత్ జవహర్ లాల్, బాణోత్ రామన్ మీడియాతో మాట్లాడారు.

జిల్లా, మండల, kgbv, మోడల్ స్కూళ్లలో ఎక్కడ లేని విధానాన్ని గిరిజన సంక్షేమ శాఖ లో అమలు చేయడం సరియైనది కాదని వారు తెలాపరు.

అనేక గ్రామాలలో కరోనా covid-19 విజృంభిస్తున్న వేళ ఇప్పటికే అనేక మంది చనిపోతున్నారు.  ఉపాధ్యాయులను గ్రామాలలో రానివ్వని పరిస్థితి ఉంది.

తమకు కరోనా వస్తే ఆదుకునే నాధుడు కూడా లేడని వారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధన ప్రకారం 50 శాతం సిబ్బంది విధులకు హాజరు అయితే చాలనని అంటుంటే గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా గిరిజన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని వారు అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునారాలోచించాలని వారు కోరుతున్నారు.

Related posts

నోటి దురుసే  దాడికి కారణం

Murali Krishna

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప స్వామి

Satyam NEWS

ఉత్తమ టైర్ మైలేజీ సాధించిన నరసరాపుపేట ఆర్టీసీ డిపో

Satyam NEWS

Leave a Comment