25.2 C
Hyderabad
October 15, 2024 12: 25 PM
Slider నిజామాబాద్

దళిత కుటుంబంపై అధికార పార్టీ అమానుష దాడి

attack on dalit

సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించిన దళిత యువకుడి కుటుంబం పై స్థానిక నాయకులు కక్ష సాధింపు ప్రారంభించారు. దాంతో ఆగలేదు నేరుగా దాడి చేసి వృద్ధ దంపతులను తీవ్రంగా గాయపరిచారు. కామారెడ్డి జిల్లా నసురలబాద్ మండలంలోని కంషేట్ పల్లి గ్రామంలో ఈ ఘటన గురువారం రాత్రి  చోటుచేసుకుంది.

ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా గత 10 సంవత్సర కాలం నుండి కంషేట్పల్లి  గ్రామంలో ఒక దళిత కుటుంబం ప్రభుత్వ స్థలం లో కబ్జాలో ఉండి ఎడ్లు, బర్లను కట్టేసి స్థలాన్ని వాడుకుంటున్నారు.

దీనికి అధికార పార్టీకి చెందిన  గ్రామ సర్పంచ్ అడ్డు పడి పంచాయితీ నుండి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ కుటుంబం ఏమి చేయలో పలుపోక భూములు విషయం తో పాటు పలు అంశాలపై అధికారులను సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించింది. దాంతో ఆ కుటుంబాన్ని చంపుతామని బెదిరించి గురువారం సర్పంచ్ భర్త తో పాటు పలువురు ఇంటిపై కి వెళ్లి అమానుషంగా దాడి చేశారు.

దీంతో వృద్ద దళిత దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడింది అధికార పార్టీ కి చెందిన వారు కావడంతో బాధితుని కి న్యాయం చేకూరేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

ములుగులో నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

గ్రామాలలో సబ్బులు, మాస్కులు పంచిపెట్టిన సేవాసంస్థ

Satyam NEWS

కలెక్టరేట్ లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment