37.2 C
Hyderabad
April 30, 2024 13: 22 PM
Slider ముఖ్యంశాలు

ఆ ఊరి పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క

#Seethakka

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ముఖ్యంగా వరంగల్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చాలాచోట్ల వంతెనలు వరద నీటిలో మునిగిపోయింది.ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం మొత్తం వరదనీటితో మునిగిపోవడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టారు.

ఇప్పటికీ గ్రామంలో సుమారు వందమంది ప్రమాదంలో ఉన్నారని, వారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. కొందరు గ్రామ పంచాయతీ కార్యాలయంపైనా ఉండిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. పరిస్థితి మరింత చేదాటకముందే ములుగు ప్రాంత ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్ కేటాయించి రక్షించాలని చేతులెత్తి వేడుకున్నారు.

Related posts

మ‌ల‌క్‌పేట్ రేస్ కోర్సులో జాకీ మృతి!

Sub Editor

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

మటన్ దుకాణదారులు మాస్కులు ధరించాల్సిందే

Satyam NEWS

Leave a Comment