28.7 C
Hyderabad
April 28, 2024 05: 39 AM
Slider కృష్ణ

11 నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్  ‘శంఖారావం’

#supersix

జగన్మోహన్ రెడ్డి అరాచక.. విధ్వంసపాలనపై గళమెత్తుతూ గతంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో కొత్త చైతన్యం రేకెత్తించిన విషయం అందరికీ తెలిసిందేనని, అధికారపార్టీ నేతల అవినీతి.. దౌర్జన్యాలు… దుర్మార్గాలు ఎండగడుతూ 222 రోజులపాటు, 3,132 కిలోమీటర్లు సాగిన యువగళం పాదయాత్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని, ప్రజలకు అండగా నేనున్నాను అనే  భరోసా ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్ పాద యాత్ర జైత్రయాత్రలా సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయు డు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మొహమ్మద్ షరీఫ్, టీ.డీ.జనార్థన్. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే “ యువగళం పాదయాత్ర రాయలసీమ, కోస్తాంద్రలో కొనసాగినట్టే ఉత్తరాంధ్రలో కూడా కొనసాగాల్సి ఉంది. కానీ అధికారపార్టీ కుట్రలు..కుతంత్రాలకు పాల్పడి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ కు పాల్పడటంతో పార్టీకోసం.. లోకేశ్ 79రోజుల పాటు యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు.

అందు వల్ల తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యువగళం యాత్రను రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగించలేకపోయారు. ఈ నేపథ్యంతో పాటు.. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలలో ప్రజలు పడుతున్న అనేక బాధలు, ముఖ్యంగా పెరిగిన ధరలతో, భద్రతలేక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి ఉద్యోగాలు లేక యువత పడుతున్న బాధలు.. రైతులు  ఎదుర్కొంటున్న కష్టాలు ఇతర వర్గాలపై జగన్ రెడ్డి వైసీపీనేతలు సాగిస్తున్న దారుణాలకు గట్టిగా సమాధానం చెప్పేలా.. అన్ని వర్గాలకు అండగా నిలిచేలా త్వరలో టీడీపీ యువనాయకుడు నారా లోకేశ్  ‘శంఖారావం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

భవిష్యత్ కు గ్యారెంటీ పేరిట టీడీపీ ప్రకటించిన పథకాలను లోకేశ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతారు. మొన్నటివరకు టీడీపీనేతలు, కార్యకర్తలు బాబుష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో రాష్ట్రానికి ప్రజలకు భవిష్యత్ లో ఒనగూరబోయే ప్రయోజనాలను స్పష్టంగా తెలియచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.   ఇప్పుడు లోకేశ్ చేపట్టబోయే శంఖారావం ద్వారా బాబుష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లిన అంశాలతోపాటు, ప్రధానంగా సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రకటించిన 6 హామీలపై విస్తృత ప్రచారం చేయ బోతున్నాం.  శంఖారావం కార్యక్రమం  నారా లోకేశను పార్టీ యంత్రాంగానికి మరింత చేరువచేస్తుందని, నేతలు.. కార్యకర్తలతో ఆయన స్వయంగా సమావేశ మై వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటారని  తెలియచేస్తున్నాం.

ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ తొలిసభ

టీడీపీ జాతీయ అధ్యక్షులు  చంద్రబాబునాయుడు, శంఖారావం కార్యక్రమాన్ని త్వరలోనే కార్యకర్తల మధ్య ఘనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ శంఖారావం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేస్తారని, రానున్న 40 రోజుల్లో యువగళం పాదయాత్ర జరగని 120 నియోజకవర్గాల్లో ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల చొప్పున 120 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. శంఖారావంలో భాగంగా లోకేశ్ అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై వారి కష్టాలు, బాధలు తెలుసుకుంటారు.

ఈ నెల 11న  టీడీపీ అధినేత చంద్రబాబు శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. యువగళం పాదయాత్ర ఎక్కడైతే ముగిసిందో, అక్కడినుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇచ్ఛాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ జరుగుతుంది. కుటుంబసాధికార సారథులు మొదలు యూనిట్  ఇన్ ఛార్జ్ లు.. బూత్ కమిటీల పర్యవేక్షకులు,టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ జరిగే శంఖారావం సభలకు హాజరవుతారు.‘శంఖారావం’  కార్యక్రమం ద్వారా నారా లోకేశ్ టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు, నేతలు.. కార్యకర్తలకు పార్టీ ఏ విధంగా అండ గా ఉంటుందో కూడా తెలియచేస్తారు. ప్రజలంతా  శంఖారావం సభలకు భారీ ఎత్తున తరలిరావాలని కోరుతున్నాం. అలానే టీడీపీ-జనసేన కార్యకర్తలు శంఖారావం సభలకు భారీ ఎత్తున హాజరై, ప్రజలకోసం ఐకమత్యంగా పనిచేయాలి.

మార్ఫింగ్ ఫోటోలతో చంద్రబాబుపై ఫేక్ ప్రచారం

చంద్రబాబు నాయుడి ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఫేక్ ప్రచారం చేయడం వైసీపీ పనికిమాలిన వెధవలకే చెల్లింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లుపట్టుకున్నట్టు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి దుష్ప్రచారం చేస్తారా? చంద్రబాబు బీజేపీ పెద్దల పిలుపు మేరకే ఢిల్లీ వెళ్లారు. కేసులభయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకోవడం.. వారికి సాష్టాంగ నమస్కారాలు చేయడం.. వంగివంగి దండాలు పెట్టడం జగన్ రెడ్డి చేస్తున్నాడు. 5 ఏళ్లుగా అదే పని చేశాడు. కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికి చివరకు తానే వంగిపోయాడు.

జగన్ రెడ్డిపై 11 అవినీతి కేసులున్నాయి. త్వరలో వాటివిచారణ పున:ప్రారంభమై ఎక్కడ మరలా తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తానన్న భయంతో జగన్ రెడ్డి వణికిపోతున్నాడు.  జగన్ రెడ్డి సహా వైసీపీనేతలు.. వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు మొత్తం ఫేక్ ఫెలోస్. వాళ్లపై మేం గతంలో ఎన్నో ఫిర్యాదులుఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటి ఫేక్ ఫెలోస్ కు అధికారంలోకి వచ్చాక ఎలా సమాధానం చెప్పాలో అలా చెబుతాం. అంతేతప్ప ఎన్నిసార్లు ఏం మాట్లా డినా ఉపయోగం లేదు.  నిన్న అనుకోకుండా అమిత్ షా వద్ద నుంచి  ఫోన్ వచ్చాకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

చంద్రబాబు బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారో ఆయనే స్వయంగా వెల్లడిస్తారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లాక, ఆయనతో పాటు పవన్ కల్యాణ్ తో మాట్లాడాలని బీజేపీ పెద్దలు ఆయన్ని కూడా పిలిచినట్టు ఉన్నారు. జగన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో మాకు తెలియదు. కోడికత్తి శ్రీనుకి బెయిల్ మంజూరు చేయడం నిజంగా అభినందనీయం. చట్టాలపై ప్రజలకు ఉన్న గౌరవం మరింత పెరుగుతుంది. తొలినుంచీ జగన్ రెడ్డి తన స్వార్థానికి  దళిత యువకుడు శ్రీనివాస్ ను, అతని కుటుంబాన్ని బలిచేశాడని మేం చెబుతూనే ఉన్నాం.

మూర్ఖుడైన జగన్ రెడ్డి అన్యాయంగా దళితబిడ్డను జైల్లో మగ్గిపోయేలా చేశాడు. కోడికత్తితో చంద్రబాబే తనను పొడిపించాడని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి దుష్ప్రచారం చేశాడు. జగన్ రెడ్డి కోరితేనే ఎన్.ఐ.ఏ కోడికత్తి కేసుపై విచారణ జరిపింది. తర్వాత ఆ వ్యవహారంలో ఎలాంటి రాజకీయకుట్ర లేదని తేల్చింది. చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి కోడికత్తి శ్రీనివాస్ ను దారుణంగా జైల్లో మగ్గిపోయేలా చేశాడు.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.

Related posts

శారదా విద్యాలయ వెబ్‌సైట్‌ ప్రారంభం

Satyam NEWS

బీసీలకు అన్యాయం చేసిన సీఎం జగన్

Bhavani

పేదల ఆరోగ్యానికి బస్తీ దవాఖానల అండ

Satyam NEWS

Leave a Comment