26.7 C
Hyderabad
April 27, 2024 07: 57 AM
Slider తూర్పుగోదావరి

బీసీలకు అన్యాయం చేసిన సీఎం జగన్

#ChandrababuNaidu

బీసీలకు మాయమాటలు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే వారిని అణగదొక్కేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన బీసీల సభలో చంద్రబాబు పాల్గొని సీఎంపై ధ్వజమెత్తారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత తగ్గించారు. బీసీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మీకు మంచి గుర్తింపు వస్తుంది. అందుకే ఆదరణ పథకం మీ కోసం అప్పుడు అమలు చేశాను. 34, 400 కోట్లు బీసీల కోసం సబ్ ప్లాన్ అమలు చేశాం.

50 శాతం జనాభా ఉన్న బీసీల కోసం జగన్ ఒక్క రూపాయి కూడా అందరి కన్నా ఎక్కువ ఖర్చు చేశాడా? 140 బీసీ కులాల కోసం ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీటీడీలో 37 మంది మెంబర్స్ ఉంటే.. బీసీలకు ముష్టి మూడు పదవులు ఇచ్చాడు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. సీఎం, డీజీపీ, సీఎస్, సకల శాఖామంత్రి, సాక్షి గుమస్తా అంతా ఆయన జిల్లాకు చెందినవారే. సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల వీరేనా రాజకీయం చేసేది..? మీరు చేయలేరా? యూనివర్శిటీల్లో వీసీలనే కాదు, రిజిస్ట్రార్లను వారి వారినే వేసుకున్నారని చంద్రబాబు తెలిపారు.

ఇతర కులాల వీసీలను తొలగించి మీకు నచ్చిన వారిని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చి.. ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి పేరు మార్చారు. జగన్ మీటింగ్‌కు రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మీటింగులకు వచ్చిన ఆడపిల్లల చున్నీలను లాగేసారు. పెళ్లి కానుక లేదు, అన్న క్యాంటీన్ లేదు.. అన్ని పోయాయి. ఆయనకు బటన్ నొక్కడం మాత్రమే వచ్చు. మీ పొట్టలు కొట్టి, జగన్ తన పొట్ట పెంచుకుంటున్నాడు.’’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

Related posts

హోసూర్‌-బెంగుళూరు మధ్య మెట్రోరైలు

Murali Krishna

క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

Satyam NEWS

డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డికి పౌర సన్మానం

Sub Editor

Leave a Comment