30.7 C
Hyderabad
April 29, 2024 06: 42 AM
Slider రంగారెడ్డి

రెచ్చిపోతున్న దొంగలు ఒణికిపోతున్న జనాలు

Collage Maker-09-Sep-2022-09.56-PM

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. కల్వకుర్తి డివిజన్ పరిధిలోనే గురువారం వినాయక నిమజ్జనంతో పట్టణమంతా పోలీస్ పహారాలో ఉన్న దొంగలు మాత్రం గతంలో ఎస్సైగా పనిచేసిన మహేందర్ ఇల్లు తాళం వేసిన ఇంటి ఓనర్ ఇంట్లోనే రాత్రి దొంగలు రెచ్చిపోయారు. యాభై ఐదు తులాల బంగారం మూడు లక్షల నగదు దోచుకెళ్లినట్టు సమాచారం.

దొంగలు మాత్రం చాలా చాకచక్యంగా తెలివితో సీసీ కెమెరాలు పగలగొట్టడం వెళ్లేటప్పుడు హార్డ్ డిస్క్ సైతం తీసుకు వెళుతున్నట్లు దొంగతనం జరిగిన బాధితులు చెప్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాదు చౌరస్తాలో మెయిన్ రోడ్డు నిత్యం కిటకిటలాడే శ్రీశైలం హైవే లో వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన దుకాణాలలో దాదాపు ఆరు దుకాణాలలో చోరీ జరిగినట్లు కొన్ని దుకాణాలలో 5000 10000 సొమ్ము చోరీ జరిగిందని, కొన్ని దుకాణంలో ఏమీ లేకపోవడంతో తిరిగి వెళ్ళినట్లు అదేవిధంగా ఓ దుకాణం షేటరు తాళాలు లేకుండా బోల్టు ఉండడంతో తీయలేక పోయినట్టు బాధితులు తెలిపారు.

అదేవిధంగా మునిసిపల్ దుకాణాలలో వ్యాపారం చేస్తున్న మారం రమేష్ దుకాణం లో కూడా చోరీ జరిగినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలిసినవి తెలవనివి చాలా దొంగతనాలు ఉన్నట్టు  పట్టణంలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

కొందరైతే ఆపరేషన్ దుర్యోధన సినిమా గుర్తుకొస్తుందని అసలు పోలీసులు ఉన్నారా లేదా అన్నట్టుగా అవినీతి అక్రమాలకు కల్వకుర్తి అడ్డాగా మారిందని పలు విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు ఇచ్చినను పట్టించుకోకపోవడంతో ఎస్పీకి సైతం ఫిర్యాదు ఇచ్చిన స్పందించకపోవడం కోర్టు రిఫర్ కేసులను సైతం ఎఫ్ఐఆర్  నమోదు చేయకపోవడంతో పోలీసుల పనితీరుపై పట్టణ వాసులు  అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వందకు డయల్ చేసిన రెండు గంటలైనా స్పందించకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతుందని పలువురు విమర్శిస్తున్నారు. వీరి పనితీరుకు అక్రమార్కులు రెచ్చిపోతూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినను బాధ్యులైన వారికి సహకరించి బాధితులపైనే ఎలాంటి విచారణ సిసి ఫుటేజ్ ను స్వీకరించకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తూ వీరు రక్షక భటులాభక్షక బటులా అనే తీరుగా పోలీసుల పనితీరు ఉందని నగరవాసుల ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ఎన్ని కథనాలు వచ్చినా ఎంతోమంది పైఅధికారులకు ఫిర్యాదు చేసినా నియంతలాగా పోలీసులు పనితీరు ఉండడం పై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే బహిరంగంగానే నియోజకవర్గ శాసనసభ్యులు వారి వర్గానికే సంబంధించిన సి ఐ లను ఎస్సైలను నియోజకవర్గ మొత్తం విధులు కట్టబెట్టడంపైనే గాక సివిల్ కేసులపై ఉన్న ఆసక్తి క్రిమినల్ కేసులపై లేకపోవడంతో పోలీసుల పనితీరుపై  వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.

అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం భే ఖాతరు చేస్తూ 41 సి ఆర్ పి సి కింద నోటీసులు ఇవ్వకుండానే, స్టేషన్ కు పిలిపించి మానసికంగా హింసించిన సంఘటనలు ఉదయం పిలిపించి సాయంత్రం వరకు కూర్చోబెట్టి, సివిల్ డ్రెస్ లో ఉదయాన్నే బలవంతంగా కొందరిని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టినట్లు ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరినైతే నీ పేరు మీద రౌడీషీటర్ ఓపెన్ చేస్తానని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  పోలీసులకు బైండోవర్ చేసే అధికారం లేదని ఆదేశాలను సైతం, బేఖాతరు చేస్తూ విధి నిర్వహణలో వారికి వారే సాటి అంటూ నియంతగా వ్యవహరించడంపై పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లా అండ్ ఆర్డర్ ను కాపాడాలని ఒరుస దొంగతనాల ఘటనలపై గట్టి చర్యలు తీసుకొని పోలీసుల పనితీరుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Related posts

152 మంది పెట్టిన కేసులు ఎత్తివేయడం సంతోషదాయకం

Bhavani

హిందువుల మనోభావాలను దెబ్బతీసే పోస్టింగులపై ఫిర్యాదు

Satyam NEWS

ఫేక్ ఎలిమినేషన్ తో రివర్స్ ఓపీనియన్

Satyam NEWS

Leave a Comment