29.7 C
Hyderabad
May 3, 2024 03: 51 AM
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు

#jagan mohan reddy

ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికే మళ్లీ సీటు ఇవ్వాలంటూ ఎమ్మిగనూరుకు చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు డిమాండ్ చేశారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి వయోభారం ఉన్నందున ఎమ్మెల్యే సీటును మరొకరికి కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నకేశవరెడ్డికి కచ్చితంగా ఎమ్మెల్యే సీటును ఇవ్వాలని, లేనిపక్షంలో తామంతా పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఎంపీపీ కేశన్న ,వైస్ ఎంపీపీ పోలయ్య, సర్పంచులు రంగస్వామి, ఎంకప్ప లక్ష్మన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు ఎమ్మిగనూరులో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి విధేయుడుగా ఉన్నారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసనసభకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అని తెలిపారు. 2024 ఎలక్షన్లలో చెన్నకేశవరెడ్డికి సీటు ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు స్పష్టంచేశారు.

Related posts

వత్తిడి ఉంది కానీ కండువా మార్చను

Satyam NEWS

రివర్స్:మాజీ ప్రియుని హత్య కేసులో 4 గురి అరెస్ట్

Satyam NEWS

POK కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమే

Satyam NEWS

Leave a Comment