40.2 C
Hyderabad
April 29, 2024 18: 56 PM
Slider ప్రత్యేకం

భార్యామార్పిడి రాకెట్ సభ్యుల్ని అరెస్టు చేసిన కేరళ పోలీసులు

#sexrocket

విద్యావంతులు ఎక్కువగా ఉన్న కేరళలో తెలివితేటలు మితిమీరుతున్నట్లున్నాయి. అక్కడ బాగా చదువుకున్న వారు కొందరు సోషల్ మీడియాలో ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? కరెక్టే సోషల్ మీడియా గ్రూప్ గా ఏర్పాటు కావడం లో ఎలాంటి తప్పూ లేదు.

అయితే అలా గ్రూప్ గా ఏర్పడిన వారు చేసిన పని చూస్తూ ఆశ్చర్యం కలుగుతుంది. ఆ గ్రూప్ లో ఉన్న వారు సెక్స్ కోసం భాగస్వాములను మార్చుకోవాలి. అంటే భార్యలను ఆ గ్రూప్ లో ఉన్న వ్యక్తులకు పరిచయం చేస్తే వారు వీరి భార్యను, వీరు వారి భార్యను ఎంజాయ్ చేస్తారన్న మాట.

ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న భర్తపై ఓ మహిళ కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం రట్టు అయింది. దాంతో ఈ రాకెట్‌కు చెందిన ఏడుగురిని కేరళ పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ గ్రూప్ లో దాదాపు 1000 జంటల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకుముందు కూడా కాయంకుళం ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఉపయోగించుకుంది. మొదట, వారు టెలిగ్రామ్, మెసెంజర్ యాప్ గ్రూపులలో చేరారు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్‌లో భాగమని పోలీసులు నిర్ధారించారు.

ప్రస్తుతం 25 మంది పోలీసుల పరిశీలనలో ఉన్నారని, రానున్న రోజుల్లో మరింత మంది అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు. రాకెట్‌లోని సోషల్ మీడియా గ్రూపుల్లో 1,000 మందికి పైగా సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నాం. దీని వెనుక పెద్ద గుంపు ఉందని, ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చంగంచెరి డీవైఎస్పీ ఆర్.శ్రీకుమార్ తెలిపారు. నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారు.

Related posts

సీఎం జగన్ పై చెక్ బౌన్స్ కేసు పెడతాం

Satyam NEWS

మమ్మల్ని నీటిలో ముంచిన డ్రైనేజీ కాంట్రాక్టర్

Satyam NEWS

రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

Satyam NEWS

Leave a Comment