38.2 C
Hyderabad
April 29, 2024 11: 18 AM
Slider పశ్చిమగోదావరి

జిల్లా రిజిస్ట్రార్ లైంగిక వేధింపులపై విచారణ వాయిదా

#dist registrar

మహిళా ఉద్యోగులపై పశ్చిమగోదావరిజిల్లా జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు లైంగిక వేధింపుల కు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై శనివారం జరగవలసిన విచారణ వాయిదా పడిందని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డి ఐ జి శివరాం తెలిపారు.

ఈ విచారణ శుక్రవారం కూడా జరిగిందని శని వారం మరి కొంత మంది బాధిత మహిళలను విచారణ చేయాల్సి ఉండగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ విచారణ వాయిదా పడిందని ఆయన అన్నారు.

మహిళలను విచారించడానికి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా అధికారులని నియమించి విచారణ జరిపించడానికి రిజిస్ట్రార్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్ తో చర్చించిన తరువాత కలెక్టర్ సూచనల మేరకు మహిళా అధికారులతో విచారణ జరపనున్నట్టు చెప్పారు.

తిరిగి ఈ విచారణ ఎప్పుడు జరిగేది తెలియజేస్తామని రిజిస్ట్రార్ శివరాం అన్నారు.

ఇదిలా ఉండగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్వర్లు తనపై పిర్యాదు చేసిన కొంత మంది మహిళా ఉద్యోగులతో తనకు అనుకూలంగా తాను.ఏవిధమైన లైంగిక వేధింపులకు పాల్పడలేదని బాధిత మహిళల స్వహస్తాలతో లెటర్ లు రాయించుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.

జిల్లాలో సుమారు 12 మంది మహిళా ఉద్యోగులు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు లైంగిక వేధింపుల కు పాల్పడుతున్నారని వ్రాతపూర్వక పిర్యాదు చేశారని సమాచారం.

ఈ ఆరోపణలపై రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు ను వివరణ కోరగా విచారణ జరుగుతున్న సమయం లో మీడియాతో మాట్లాడలేనని అన్నారు.

Related posts

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ట్యాబుల పంపిణీ

Bhavani

తల్లిపైనే దాడిచేసిన తాగుబోతు కొడుకు

Satyam NEWS

నేను లంచం తీసుకోను: సిన్సియర్ గా పని చేస్తా

Satyam NEWS

Leave a Comment