40.2 C
Hyderabad
April 29, 2024 15: 31 PM
Slider నిజామాబాద్

డబుల్ ఇళ్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పెట్టండి

#shabbirali

50 ఏళ్ల పాటు ఉండేలా నాణ్యతతో నిర్మించామని చెప్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు కేవలం 50 రోజుల పాటు అందులో ఉండాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఇళ్ల నాణ్యతపై ఇంజనీర్లను తీసుకువచ్చి పరిశీలిద్దామని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన సవాల్ పై షబ్బీర్ అలీ స్పందించారు. నేడు ఉదయం 10 గంటలకు టేక్రియాల్ బైపాస్ వద్ద నిర్మించిన ఇళ్ల వద్దకు వస్తానని అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే కోసం వేచి చూసారు.

మీడియా సాక్షిగా డబుల్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతలేని పనులను పరిశీలించారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిర్మించిన బేస్మిట్, సిమెంట్, సలాకతో నిర్మించాల్సిన పనులను మట్టితో చేపట్టడాన్ని, పగిలిన అద్దాలను మీడియాకు చూపించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే రాకపోవడంతో సవాల్ చేసి పారిపోయాడని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ‘డబుల్ బెడ్ రూం ఇండ్లు నాణ్యతతో నిర్మించినం.. మా ఇంజనీర్లను తీసుకుని వస్తా.. దమ్ముంటే నువ్వు కూడా నీ ఇంజనీర్లను తీసుకునిరా.. డబుల్ ఇళ్ల నాణ్యతను పరిశీలిద్దామని గంప గోవర్ధన్ నాపై సవాల్ చేశారన్నారు. ఎమ్మెల్యే గంప చేసిన సవాల్ ను స్వీకరించి ఈరోజు ఉదయం 10 గంటలకు టేక్రియాల్ డబుల్ ఇళ్ల వద్దకు వచ్చానన్నారు.

12 గంటల వరకు వేచి చూసినా.. ఇంజనీర్లను తీసుకుని వస్తా అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే రాలేదని విమర్శించారు. సిమెంట్, సలాకలు వేసి నిర్మించాల్సిన ఇళ్లను మట్టితో నిర్మించారన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టు 50 సంవత్సరాలు కాదు కదా 50 రోజులు కూడా అందులో ఉండలేరన్నారు. ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని 50 రోజుల పాటు ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లలో పెట్టాలని, 50 రోజుల పాటు మీరు, మీ బీఆర్ఎస్ నాయకులు అందులో ఉండి చూస్తే తెలుస్తుందన్నారు.

నాణ్యత లేని ఇళ్లలో ప్రజలు ఉండటానికి భయపడుతున్నారని, అనుకోని విపత్తు సంభవించినా, భారీ వర్షాలు కురిసినా డబుల్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలకు ఏదైనా జరిగితే ఎవరు బాద్యులని ప్రశ్నించారు. డబుల్ ఇల్లు లిక్కర్ షాపులుగా .ఆరుతున్నాయని, పర్మిట్ రూంలు అయ్యాయని ఎద్దేవా చేశారు. గాలి వాన వస్తే పడిపోతాయని మెస్ట్రీలు చెప్తున్నారని, తమ సంఘం నుంచి బాజాప్తా రాసిస్తాం అంటున్నారని పేర్కొన్నారు. నాణ్యత లేని ఇళ్లను వెంటనే కూల్చేసి మళ్ళీ నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఇది ప్రజల డబ్బు.. బీఆర్ఎస్ డబ్బు కాదు.. సంబంధిత ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలి.. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు రికవరీ చేయాలన్నారు. డబుల్ ఇళ్ల సెలక్షన్ ఎమ్మెల్యేలు, మంత్రులు కాకుండా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని,  ప్రజల సమక్షంలో గ్రామసభ నిర్వహించి అర్హుల జాబితా తయారు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లను ఇస్తామని, స్థలం ఉన్నవారికి 5 లక్షలు అందిస్తామన్నారు.

రోడ్డుపై ధర్నా చేస్తున్న నాయకులు

Related posts

సమష్టి కృషితో ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

Bhavani

హైదరాబాద్ ఐటిఐఆర్ కు నిధులు కేటాయించండి

Satyam NEWS

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట సాగుకు మొగ్గు చూపాలి

Satyam NEWS

Leave a Comment