28.7 C
Hyderabad
April 27, 2024 03: 40 AM
Slider నల్గొండ

సకాలంలో పంట ఋణాలు చెల్లించి లబ్ది పొందండి

#bankloans

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు యరగాని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ సంఘం నుండి స్వల్పకాలిక,దీర్ఘకాళిక వ్యవసాయ పంట ఋణములు పొందిన రైతులు సకాలములో వాయిదా లోపు చెల్లించి రెన్యువల్ చేసుకొన్న వారికి 7% శాతం వడ్డీ,అలా చెల్లించిన రైతులకు మాత్రమే వడ్డీ రిబేటు,వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. 

వాయిదా మీరిన తేదీ నుండి వడ్డీ రిబేటు,వడ్డీ రాయితీ లభించక పోగా 13% శాతం అపరాదపు వడ్డీతో చెల్లించ వలసి ఉన్నందున రైతులు సకాలంలో  ఋణాలను రెన్యూవల్ చేసుకోవాలని కోరారు. రైతులకు సంఘం నందు ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు కె. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు గోసుల శ్రీను, రాయల వెంకటేశ్వర్లు, మీసాల శ్యామ్ సుందర్, కటారు శ్రీను,దుగ్గి బ్రహ్మం, దేవరం మల్లీశ్వరి,భూక్యా లచ్చీరామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ తీరు బట్టబయలు

Satyam NEWS

నాగార్జున సాగర్ లో మున్నూరు కాపు శిక్షణాశిబిరం

Satyam NEWS

వాలంటీర్ చేసిన హత్య … ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే

Satyam NEWS

Leave a Comment