32.7 C
Hyderabad
April 27, 2024 01: 05 AM
Slider నల్గొండ

పెరిగిన పెట్రోల్, డీజిల్ చార్జీలతో ఆటో డ్రైవర్లకు తీరని నష్టం

#CITU Hujurnagar

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచటం అన్యాయమని, పెంచిన రేట్లతో ఆటోలని నడిపే పరిస్థితి లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. హుజూర్ నగర్ పట్టణములోని ఆటో కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని, లేదా ఆటోలకి సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని  శీతల రోషపతి కోరారు.

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బొగ్గు గనులను,రైల్వేలను ప్రైవేటీకరణ చేయడం సరైంది కాదని,  ప్రజల ఆస్తిని చౌకగా అంబానీ లాంటి వారికి కట్టబెట్టే పరిస్థితి సరికాదని రోషపతి తీవ్రంగా ఆరోపించారు. కరోనా కేసులను ఆరోగ్యశ్రీ క్రింద చేర్చి ప్రతి గ్రామంలోని ప్రజలకు పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈనెల 19న హుజూర్ నగర్ లో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటియు రౌండ్ టేబుల్ సమావేశంలో నియోజకవర్గ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు నాయకులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో సంఘ నాయకులు  గోపి, ఉపేందర్, సత్యం ,బాలు, సైదులు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 121వ జయంతోత్సవం

Satyam NEWS

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు

Satyam NEWS

Leave a Comment