30.7 C
Hyderabad
April 29, 2024 04: 25 AM
Slider సినిమా

11 భాష‌ల‌కు విస్త‌రిస్తున్న శ్రేయాస్ ఈటీ

#ShreyasET

శ్రేయాస్ ఈటీ ఇంట్ర‌డ్యూస్ చేసిన ఎనీ టైమ్ థియేట‌ర్‌ బిజినెస్ మోడ‌ల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీ. కరోనా మహామ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ తో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయ‌ని ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ నిర్మాత‌ల‌కు పే ప‌ర్ వ్యూ మోడ‌ల్ అద్భుతాలందిస్తోంది.

శ్రేయాస్ ఈటీ త‌న సేవ‌ల‌ను అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో అందిస్తోంది. అప్స‌రా రాణి, రాక్ క‌చ్చి న‌టిస్తోన్న చిత్రం థ్రిల్ల‌ర్‌ ను ఆగ‌స్ట్ 14 న 11 భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రామ్‌గోపాల్ వ‌ర్మ 2 సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ విజ‌యాన్ని సాధించ‌గా, ఆయ‌న నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై వ‌స్తోన్న 3 వ చిత్రం థ్రిల్ల‌ర్ కోసం ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డమే అందుకు నిద‌ర్శ‌నం. ఏటీటీ ద్వారా వివిధ భాష‌ల్లో థ్రిల్ల‌ర్‌ ను ప్ర‌మోట్ చేయ‌డానికి క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌, వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ద‌స‌రాలోపు 50 ఫిలిమ్స్‌ను రిలీజ్ చేయాల‌నేది శ్రేయాస్ ఈటీ ల‌క్ష్యం. మార్చి 2021 లోగా, దేశ‌వ్యాప్తంగా 200 ల స్క్రీన్ల‌కు కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించనుంది.

Related posts

రాహుల్ గాంధీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఎస్ఎఫ్ఐ

Satyam NEWS

వారంలో రెండు రోజులు కోవిడ్ టీకాల కార్యక్రమం నిలిపివేత

Satyam NEWS

నాణ్యమైన రోడ్లతో మరింత అభివృద్ధి

Bhavani

Leave a Comment