Slider విజయనగరం

ఎన్టీఆర్ పేరు కొనసాగించాలంటూ 5 వేల మంది సంతకాలు

TDP

తెలుగు భాష జాతీయ స్థాయిలో ఫరిడవిల్లిందంటే అందుకు అన్న ఎన్టీఆర్ కారకుడు. ఆ తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికూడా కారకుడు ఎన్టీఆరే.తెలుగు భిషకు ప్రాచుర్యం కల్పించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు ను…ప్రజల హృదయింతరాల నుంచీ తొలగించే కుట్ర కు దిగిన సీఎం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కి నిరసనగా విజయనగరం టీడీపీ నేతలు సంతకాలు ఉద్యమం చేపట్టారు.

గత నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ,మహారాజ ప్రభుత్వ వైద్య శాలలకు ఉన్న ఆ రెండు పేర్లు జగన్ ప్రభుత్వం తీసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ రెండింటికి తిరిగి పాత ,ఉన్న పేర్లనే కొనసాగించాలని కోరారు విజయనగరం టీడీపీ.. సంతకాలు సేకరణ చేపట్టింది. అనూహ్య స్పందన రావడంతో ప్రత్యేకించి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేంద్ర మాజీ  మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఆ సంతకాలు కార్యక్రమం జరిగింది.

దరిమిలా… సేకరించిన ఆ సంతకాలను ఓ ఫ్లెక్సీ గా రూపోందించిన పార్టీ.. దాన్ని జిల్లా కలెక్టర్ సూర్య కుమారికి అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సూర్య కుమారీ…ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పారని టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,కంది మురళి నాయుడు, ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్..తదితరులు చెప్పారు.

Related posts

సరిహద్దుల్లో తరచూ కాల్పులకు దిగుతున్న భారత్

Satyam NEWS

కాలనీ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

Bhavani

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

Satyam NEWS

Leave a Comment