42.2 C
Hyderabad
May 3, 2024 16: 14 PM
Slider కరీంనగర్

లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై మరింత కఠిన చర్యలు

#SircillaPolice

రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఏడవరోజు పటిష్టమైన బందోబస్తు మధ్య లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే సిరిసిల్లా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేసి లాక్ డౌన్ పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో 11 ప్రాంతాలను ప్రత్యేక హాట్ స్పాట్స్ గా గుర్తించామని తెలిపారు. ఒక ఎస్.ఐ ముగ్గురు కానిస్టేబుల్స్ తో ప్రత్యేక పికెట్స్ శాంతినగర్ ,పోస్ట్ అఫిస్, వెంకంపెట్, సుభాష్ నగర్, వాని హస్పటిల్, జె.పి నగర్,అంబేడ్కర్ నగర్, బి.వై నగర్,సాయిబాబా టెంపుల్, విద్యానగర్, కోర్ట్ చౌరస్తా రోడ్ లో ప్రత్యేక పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని అన్నారు.

స్పెషల్  డ్రైవ్ లో భాగంగా బైక్ పై తిరుగుతూ పికెట్స్ ను ఆయన తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బయటకి వచ్చిన 71 వాహనాల పై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో ఎలాంటి కారణం లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న వాహనదారులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 1555 కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ప్రణాళిక ప్రకారం పట్టణంలో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సుకై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి కలిసికట్టుగా చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రజలంతా తమకు తాము రక్షించుకుంటూ సమాజాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల టౌన్ రూరల్ సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి

Satyam NEWS

జగనన్న సేవకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది…..

Satyam NEWS

ప్రధాని టూర్ పై అతిగా స్పందన : చన్నీ

Sub Editor

Leave a Comment