18.7 C
Hyderabad
January 23, 2025 02: 14 AM
Slider ఆధ్యాత్మికం

యువర్ హైనెస్: హిమాలయాల సమీపంలో శ్రీవారి ఆలయం

tirumala

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జమ్మూ లో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధమౌతున్నది. అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మూ ప్రభుత్వం ఇందుకోసం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు శ్రీవారి దేవాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తిం చామన్నారు. ఈ ఏడాదిలోనే జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.

Related posts

గ్రామీణ ప్రాంత చిన్నారుల కోసం సోనాలికా ఎడ్యుటెక్‌ ఈ గురుకుల్‌ ప్రారంభం

Satyam NEWS

శరద్ పవర్ ఆలోచన అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

రైతు సంక్షేమంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment