38.2 C
Hyderabad
April 29, 2024 20: 40 PM
Slider శ్రీకాకుళం

పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు

#ministerbotsa

రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో ఇస్తున్న కిచిడి రుచికరంగా వుండటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయనీ, వీటిపై సీఎం జగన్  తో చర్చించిన మీదట మెనూ లో కిచిడికి ప్రత్యామ్నాయంగా పప్పు పులుసును చేరుస్తున్నట్టు తెలిపారు.

గుర్ల మండలం నాగళ్ల వలస లో గ్రామ సచివాలయం భవనాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సంధర్భంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుపై మంత్రి బొత్స గ్రామసభలో సమీక్షించారు. ఈ సంధర్భంగా గ్రామంలో విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి గ్రామస్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై ఆరా తీశారు.

కొందరు విద్యార్థులను పిలిచి మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న ఆహారం ఎలా ఉందని మంత్రి బొత్స  ప్రశ్నించారు. కిచిడి, పులిహోర రుచికరంగా వుండటం లేదని విద్యార్ధులు మంత్రి బొత్స కు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిచిడి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వున్నాయని, అందువల్ల మెనూ లోంచి కిచిడి తొలగించి పప్పు పులుసును చేర్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

విద్యా కానుకలో భాగంగా విద్యార్ధులకు సరఫరా చేసిన స్కూల్ బ్యాగుల్లో చిరిగి పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయని, రాష్ట్రంలో 9 శాతం బ్యాగులు ఈ విధంగా జరిగినట్లు ఫిర్యాదులు అందాయనీ పేర్కొన్నారు. చిరిగిన బ్యాగుల స్థానంలో కొత్తవి సరఫరా చేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య అందించడం పై దృష్టి సారించాలని సూచించారు. గ్రామంలో అమ్మ ఒడి ఎందరికి వస్తుందనే అంశాన్ని మంత్రి బొత్స తెలుసుకున్నారు.

గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు, నాటు సారా తయారీ జరుగుతున్నదీ లేనిదే మంత్రి ఆరా తీశారు. కొందరు గ్రామంలో కొన్ని షాప్ ల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో దీనిపై మహిళా సంరక్షణ కార్యదర్శిని పిలిచి ఇకపై గ్రామంలో మద్యం విక్రయాలు జరుగుతున్న మాట వినిపించకూడదని, అటువంటి ఫిర్యాదులు వస్థే మహిళా సంరక్షణ కార్యదర్శి నే బాధ్యుల ను చేస్తామన్నారు. 

గ్రామంలో అధికంగా 58 మంది వికలాంగ ఫించన్ తీసుకుంటున్నట్టు పంచాయతీ కార్యదర్శి చదివి వినిపించడంతో ఇంత మంది వికలాంగులు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇందుకు గల కారణాలపై అధ్యయనం చేయించాలని జిల్లా కలెక్టర్ శ సూర్యకుమారి కి మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా అధికారులు జెడ్పీ సీఈవో అశోక్ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వి.టి.రామారావు, ఆర్.డి. ఓ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓ దిశ నువ్వెక్కడ: జీవోలు ఇవ్వడమే తప్ప ఆచరించడం శూన్యం

Satyam NEWS

మిడిల్ ఈస్ట్ లో మోడీ జన్మదిన కార్యక్రమం

Satyam NEWS

ఎటెన్షన్: రైతన్నలూ రైస్ మిల్లర్స్ తో జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment