30.7 C
Hyderabad
April 29, 2024 06: 53 AM
Slider ఖమ్మం

వరదలపై జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో సైతం భారీగా వర్షలు కురుస్తున్న తరుణంలో భద్రాచలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో నదికి వరద పోటెత్తుతోంది.

భద్రాచలం వద్ద ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేయగా ప్రస్తుతం ప్రస్తుతం 53 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మూడవ  ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో వరదల ఉదృతిని సమీక్షిస్తూ మంత్రి పువ్వాడ ను భద్రాచలంలోనే ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్  సూచించారు.

దాంతో వరద పరిస్థితులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రెగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ITDA PO గౌతమ్ తో కలిసి గోదావరి ఉదృతిని పరిశీలించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదావరి వరద సంసిద్ధత మరియు సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.

ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి

భద్రాద్రి జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అందుకు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గొర్రెలు, మేకలు పశువులను సైతం మేతకు విడిచిపెట్టకుండా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలని వాటి కాపర్లకు సూచించారు.

ప్రజలు వాగులు, వంకలు, నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులను కాజ్ వే, నీరు ప్రవహిస్తున్న దారుల గుండా రాకపోకలు నిలిపివేయాలన్నారు. నిత్యం శానిటేషన్ చేపట్టాలని కోరారు. క్రమం తప్పకుండా బ్లీచింగ్ వెదజల్లాలని సూచించారు.

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, షార్ట్ సర్క్యూట్ లు, ప్రమాద స్థాయిలో ఉన్న వైర్ లలో విద్యుత సరఫరా నిలిపి, పునరావాస ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలకు అవసరమయ్యే మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్ లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. మనం గతంలో ఇలాంటి వరదల తీవ్రతను, వరద పరిస్థితులను ఎదుర్కొన్నదాఖలాలు ఉన్నాయని అన్నారు.

ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, ఏక్కడ ఎలాంటి అత్యవసర సహాయం అవసరం ఉన్నా సకాలంలో స్పందించే విధంగా ఉండాలన్నారు. జిల్లా వాసులకు హెల్ప్ లైన్ సెంటర్ లు సబ్ కలెక్టర్ ఆఫీస్, కలెక్టరేట్ నందు ఎర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామని ప్రజలు దాన్ని సద్వినియోగించుకొవాలని కొరారు.

కలెక్టర్ కార్యాలయపు కంట్రోల్ రూము 08744-241950, వాట్సప్ నంబర్-9392929743, ఆర్డిఓ కార్యాలయపు కంట్రోల్ రూము, వాట్సప్ నంబర్-9392919750, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూము 08743 232444, వాట్సప్ నంబర్ 6302485393 ద్వారా అత్యవసర సేవలు పొందాలని సూచించారు. సమీక్షలో ఎమ్మేల్యే పోదెం వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య అన్ని శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Related posts

అలెర్ట్ :రాజాసింగ్ హౌస్అరెస్ట్ఉత్తర తెలంగాణలో నెట్ కట్

Satyam NEWS

30న ఘనపూర్ లో అంతర్జాతీయ జానపద దినోత్సవం

Satyam NEWS

పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దారులకు బియ్యం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment