Slider నల్గొండ

సేవ్ పబ్లిక్ సెక్టార్ – సేవ్ సోషల్ జస్టిస్

#roshapati

న్యాయాన్ని కాపాడు కోవడానికి మేధావివర్గం,వెనుకబడిన వర్గాలు ఐక్యంగా మన భారత రాజ్యాంగాని కాపాడుకోవాలని, మనువాదాన్ని, ఆదాని, అంబానీ ని వ్యతిరేఖించాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CITU కార్యాలయంలో భారత రత్న అవార్డు గ్రహీత భారతదేశంలో జన్మించిన ఆణిముత్యం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ, జయంతి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల కాలంలో వివిధ పార్టీలు అధికారంలో వచ్చిన రాజ్యాంగానికి హాని చేయలేదని,గత ఆరు సంవత్సరాల క్రితం బిజెపి అధికారంలోకి వచ్చి భారతదేశంలోని అన్ని వర్గాల వారిని సర్వనాశనం చేసి, పెట్టుబడిదారులకు కారు చౌకగా భారతదేశాన్ని అమ్ము తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజ్యాంగం ద్వారా వెనకబడిన వర్గాలకు లభించే రిజర్వేషన్లు రద్దు దొడ్డిదారిన తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని,వీటికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా పోరాటాలకు సమైక్యం కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఉపతల వెంకన్న, ఉపతల గోవిందు, రాజు, పెంటయ్య, మహిపాల్, మణి, ఉమ, సునీల్, నాగేశ్వరరావు, కొండపల్లి శీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జైలులో మారణకాండ.. 116కి చేరిన మృతుల సంఖ్య..

Sub Editor

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను తరిమికొట్టగలం

Satyam NEWS

Sale Monster Test Pills

Bhavani

Leave a Comment