తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్ట దలచిన నీరా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్ కుమార్, టూరిజం ఎండి మనోహర్ తో కలిసి నక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని సర్వే చేసి, ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆర్కిటెక్ట్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అందులో భాగంగా గౌడ కుల వృత్తిని ఆదుకోవడానికి నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ G.O No.116 ను విడుదల చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేసి నీరా స్టాల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం విడతల వారిగా జిల్లాలలో నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
previous post