33.7 C
Hyderabad
April 30, 2024 02: 29 AM
Slider ఆధ్యాత్మికం

సూర్య ప్రభ వాహనం పై మాడ వీధుల్లో శ్రీ సౌమ్యనాధ స్వామి దర్శనం

#suryaprabhavahanam

అన్నమయ్య జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శ్రీసౌమ్యనాధ స్వామి వారు సూర్య ప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి పట్టు వస్త్రాలతో,స్వర్ణా భరణాలతో, వివిధ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకార భూషితులై ఆశీనులైనారు. మంగళ వాయిద్యాలు,కోలాటాలు,డప్పు వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో భక్తులు కు దర్శన మిచ్చారు. భక్తులు నారికేలం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల గోవింద నామాలు కోలాహలం మధ్య తిరుచ్చి వేడుకగా సాగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా బాస్కర్ రెడ్డి, ఆలయ సూపర్నిడెంట్ నటేష్ ,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ అర్చకులు సునీల్,సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్

Sub Editor

మాస్క్ పెట్టుకోని వారి వాహనాలు తనిఖీ చేసిన వనపర్తి పోలీసులు

Satyam NEWS

ఘనంగా శ్రీ పురంధరదాసు ఆరాధనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment