38.2 C
Hyderabad
April 28, 2024 19: 42 PM
Slider ప్రత్యేకం

మానవత్వంతో స్పందించిన పోలీసులకు అభినందనలు

#vijayanagarampolice

విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసి కాంప్లెక్సులో మూడు రోజులపాటు ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి సపర్యలు చేసి, స్వచ్ఛంద సంస్థ సహకారంతో వృద్ధాశ్రమంలో చేర్పించి, మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబులు, మహిళా హోంగార్డును జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

వివరాల్లోకి వెళ్ళితే.. విశాఖకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధురాలు  బొబ్బిలి ఆర్టీసి కాంప్లెక్సుకు చేరుకొని, ఒంటరిగా మూడు రోజులపాటు కాంప్లెక్సులోనే ఉండడంతో, విషయం తెలుసుకున్న బొబ్బిలి ట్రాఫిక్ హోమ్ గార్డు ఐ.ఝాన్సీ రాణి ఆమెను కలిసి, వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమె కుటుంబ సభ్యుల వివరాలు చెప్పేందుకు నిరాకరించడం, తీవ్ర జ్వరంతో ఏమీ తినేందుకు కూడా ఇష్టపడడక పోవడంతో హోంగార్డు ఝాన్సీరాణి తన ఇంటికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది.

ఇంటికి వచ్చేందుకు కూడా ఆమె నిరాకరించడంతో తన ఇంటి నుండే భోజనం, టీ వంటివి తీసుకొని వచ్చి వృద్ధురాలికి అందచేసి, జ్వరానికి మందులు ఇచ్చింది. తరువాత ఈ విషయాన్ని బొబ్బిలి సీఐ శోభన్ బాబు దృష్టికి తీసుకొని వెళ్ళగా వృద్ధురాలికి ఆశ్రయం కల్పించేందుంకు ఆయన ప్రయత్నించారు.

అయితే తన పనులను తాను చేసుకొనే స్థితిలో లేని  వృద్ధురాలిని చేర్చుకోవడానికి వృద్ధాశ్రమ సిబ్బంది విముఖత చూపించారు. ఈ విషయాన్ని బొబ్బిలిలో పని చేస్తున్న టి. గౌరీ శంకరరావు విజయనగరం యూత్ ఫేస్ బుక్ గ్రూప్ నకు కు వాట్సాప్ చేయడంతో వైరల్ మారింది. విజయనగరం  బాబామెట్టకు చెందిన ఎ.టి.కే. వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు ఖలీల్ బాబు దీనికి స్పందించారు.

విజయనగరం యూత్ ఫేస్ బుక్ గ్రూప్ సభ్యులు ప్రత్యేకంగా వృద్ధురాలి కోసం అంబులెన్సు పంపారు. బొబ్బిలి హెచ్ సి టి. గౌరీశంకరరావు, ట్రాఫిక్ హెూంగార్డు ఐ.ఝాన్సీరాణి ప్రత్యేక చొరవ తీసుకొని వృద్ధురాలిని విజయనగరం బాబామెట్ట తీసుకొని వచ్చి, వృద్ధాశ్రమంలో చేర్పించారు.

విధి నిర్వహణతోపాటు, సమస్య పట్ల సానుకూలంగా స్పందించి, మానవత్వం చాటుకున్న బొబ్బిలి హెచ్ సి టి. గౌరీ శంకరరావును, ట్రాఫిక్ హెూంగార్డు ఝాన్సీరాణిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తన ఆఫీసు కు పిలిపించి, ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో హోం గార్డ్స్ ఆర్ ఐ  పి. ఈశ్వరరావు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

Satyam NEWS

మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం

Bhavani

వేణుగాణాలంకారంలో కోదండరాముడు

Satyam NEWS

Leave a Comment