29.7 C
Hyderabad
April 29, 2024 08: 31 AM
Slider నెల్లూరు

యువతలో నాయకత్వ లక్షణాలపై 24న వెబినార్

#akella

జాతీయ సేవా పథకం ఆవిర్భావ  దినోత్సవ సందర్భంగా ఈ నెల  24 వ తేది నెల్లూరులోని  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో  “సమాజాభివృద్ధి కోసం యువతలో నాయకత్వపు లక్షణాలు అభివృద్ధి చేయడం” అనే అంశంపై జాతీయ ఆన్ లైన్ వెబినార్ ను  నిర్వహిస్తునట్లు రిజిస్ట్రార్ డా. యల్ వి కె రెడ్డి ఒక పత్రికా ప్రకటన తెలియచేసారు.

ఈ కార్యక్రమానికి, ఐఏఎస్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమాని, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త ఆకెళ్ల రాఘవేంద్ర ముఖ్య వ్యక్తిగా పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే యువత ఆలోచనా ధోరణిలో కచ్చితంగా మార్పు వస్తుందని, వీలైనంత మంది యువకులలో ఆకెళ్ళ ఉత్తేజిత ప్రసంగం ద్వారా మార్పు తేవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇతర వివరాలకు వెబినార్ నిర్వాహకులు, సహాయ అధ్యాపకుడు, ఎన్ యస్ యస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం (చరవాణి సంఖ్య – +918187814140) ను సంప్రదించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గం. నుండి  వీక్షించవచ్చు

వెబినార్  జూమ్ లింక్ వివరాలు :-

https://oracle.zoom.us/j/8527499882?pwd=cU5uTGIzUEw1V0hjRWZXeitzUnV4dz09

లాగిన్ కొరకు

Meeting ID: 852 749 9882

Password: 12345678

Related posts

రియలైజేషన్: గెలుపు ఓటములు సహజం

Satyam NEWS

Analysis: మహాత్ముడికి మహా అవమానం

Satyam NEWS

కంట్రోల్ కరోనా:తెల్లాపూర్ లో వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment