40.2 C
Hyderabad
April 26, 2024 13: 48 PM
Slider విజయనగరం

ప్రతీ సోమవారం ఇకపై పార్వతీపురం మన్యం జిల్లాలో “స్పందన”

#deepikaips

ప్రతీ సోమవారం ఇకపై పార్వతీపురం మన్యం జిల్లాలో “స్పందన” కార్యక్రమంను అక్కడ జిల్లా ఎస్పీ నిర్వహించనున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వారు విజయనగరం జిల్లా కేంద్రంకు రానవసరం లేదని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపికా  కోరారు.

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాలూరు, మక్కువ, పాచి పెంట, పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, నీలకంఠాపురం, జియ్యమ్మవలస, కురుపాం, చినమేరంగి ప్రాంతాల నుండి ప్రజలకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు గతంలో విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చేవారన్నారు. పరిపాలనా సౌలభ్యం కొరకు నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం వేరు వేరుగా జిల్లాలుగా ఏర్పడిన దృష్ట్యా “స్పందన” కార్యక్రమాలను కూడా పోలీసుశాఖ వేరు వేరుగా నిర్వహించి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

కావున, ప్రజలు గమనించి తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి సంబంధించిన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే “స్పందన” కార్యక్రమంలో మాత్రమే ఫిర్యాదులను చేయాలని ప్రజలకు ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక సూచించారు.

Related posts

ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలపై సరికొత్త వివాదం

Satyam NEWS

ప్రజల ప్రాణాలు తీసేందుకేనా ఈ ఉత్సవాలు

Bhavani

డిగ్రీ చదివే అనూషను దారుణంగా హతమార్చారు

Satyam NEWS

Leave a Comment